ఐపీఎల్-2025 మెగా వేలానికి బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఇంకా ఆటగాళ్ల రిటెన్షన్ రూల్స్‌పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం ఇంకా ఎటువంటి ఆధికారిక ప్రకటన చేయలేదు.
వాస్తవానికి మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు గరిష్టంగా ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకొని మిగతా ఆటగాళ్లను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇదే విషయాన్ని గత నెలలో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్‌లో కూడా ఆయా ఫ్రాంచైజీలు ప్రస్తావించాయి. కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం ఆయా ఫ్రాంచైజీల అభ్యర్ధననను తిరష్కరించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో మెగా వేలాన్ని ఈ ఏడాది చివరలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టే ఆయా ఫ్రాంచైజీలు కూడా తమ జట్టులో సమూల మార్పులు దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆర్సీబీకి ఆడాలని ఉంది: రింకూ
ఇక ఐపీఎల్ మెగా వేలం వార్తల నేపథ్యంలో టీమిండియా ఫినిషర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్ తన మనసులోని మాటను బయట పెట్టాడు. ఒకవేళ కేకేఆర్ అతడిని రిటైన్ చేసుకోపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడాలన్న తన కోరికను రింకూ వ్యక్తపరిచాడు. విరాట్ కోహ్లి ఆర్సీబీలో ఉన్నందున ఆ ఫ్రాంచైజీకి ఆడాలనకుంటున్నట్లు అతడు తెలిపాడు.
కాగా తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి రింకూ కేకేఆర్ తరపున ఆడుతున్నాడు. కొన్ని సీజన్‌లలో అతడిని కోల్‌కతా వేలంలోకి విడిచిపెట్టినప్పటకి తిరిగి మళ్లీ సొంతం చేసుకుంది. ఆ జట్టు ఫినిషర్‌గా రింకూ మారాడు.
అయితే ఈ ఏడాది సీజన్‌లతో కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలిచినప్పటకి రింకూ మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో కేకేఆర్ తరపున 45 మ్యాచ్‌లు ఆడిన రింకూ 143.34 స్ట్రైక్ రేటుతో 893 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment