అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, నయా ఫినిషర్ రింకూ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇద్దరూ కలిసి పరుగుల వరద పారించారు.
పవర్ ప్లేలో 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి జట్టులో కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. రోహిత్ శర్మ, రింకూ సింగ్ పట్టుదలగా నిలబడ్డారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ అఫ్గన్ ఆటగాళ్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడారు.
మొత్తంగా.. 69 బంతుల్లో.. 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 121 పరుగులు బాదిన రోహిత్ హిట్‌మ్యాన్ అనే బిరుదును సార్థకం చేసుకున్నాడు. మరో ఎండ్ నుంచి కెప్టెన్ రోహిత్‌కు అన్ని విధాలా అండగా నిలిచిన రింకూ సైతం బ్యాట్ ఝులిపించాడు.
ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ యూపీ కుర్రాడు.. 39 బంతుల్లో 69 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. రింకూ ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉండటం విశేషం. ఇక రోహిత్- రింకూ పటిష్ట భాగస్వామ్యం కారణంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.మరి ఈ మ్యాచ్ సందర్భంగా.. రోహిత్ శర్మ- రింకూ సింగ్ నమోదు చేసిన రికార్డులు గమనిద్దాం!
Rohit Sharma 🤝 Rinku Singh
— BCCI (@BCCI) January 17, 2024
OuR’RR’ 😎 💪#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 | @rinkusingh235 pic.twitter.com/SfKSl07JoE
అంతర్జాతీయ టీ20లలో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసింది వీళ్లే
►రోహిత్ శర్మ- రింకూ సింగ్- అఫ్గనిస్తాన్ మీద- 190 నాటౌట్- 2024లో
►సంజూ శాంసన్- దీపక్ హుడా- ఐర్లాండ్ మీద- 176 రన్స్- 2022లో
►రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్- శ్రీలంక మీద- 165 రన్స్- 2017లో
►యశస్వి జైశ్వాల్- శుబ్‌మన్ గిల్- వెస్టిండీస్ మీద- 165 రన్స్- 2023లో.
అంతర్జాతీయ టీ20లలో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు
►36- స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్-డర్బన్- 2007లో
►36- అకిల ధనంజయ బౌలింగ్‌లో- కీరన్ పొలార్డ్- కూలిడ్జ్- 2021లో
►36- కరీం జనత్ బౌలింగ్‌లో- రోహిత్ శర్మ, రింకూ సింగ్- బెంగళూరుల- 2024లో.
చదవండి: రోహిత్ విధ్వంసకర ఇన్నింగ్స్.. దెబ్బకు రికార్డులన్నీ బద్దలు! ఇది కదా ఊచకోత
Comments
Please login to add a commentAdd a comment