బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయినా ఫైట్ చేయడం సినిమాల్లోని హీరోలకే సాధ్యం. అదే రియల్ లైఫ్‌లో హీరో అయినా జీరో అయిపోతాడు. కానీ ఈ సంక్షేమ అధికారి కథ వింటే ఆ మాట తప్పు అని ఒప్పుకుంటారు. తన నిజాయితీకి బహుమానంగా ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు దుండగులు. చావు అంచాలదాక వెళ్లి వచ్చాడు. ఆయన స్థానంలో మరొకరు ఉంటే జీవచ్ఛవంలా అయిపోతారు. కానీ ఆయన ఎక్కడైతే తనకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందో అక్కడకే మళ్లీ ఐఏఎస్ హోదాలో వచ్చి మరీ వాళ్ల పనిపట్టారు. ఇలాంటి కథ సినిమాల్లోనే చూస్తాం. కానీ రియల్ లైఫ్‌లో కూడా సాధ్యమే అని ప్రూవ్ చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు ఆయనే....
ఆ అధికారి పేరు రింకు సింగ్ రాహీ. ఉత్తరప్రదేశ్‌కి చెందిన రింకు రాష్ట్ర స్థాయి పీసీఎస్ ఎగ్జామ్ 2007 క్వాలిఫై అయ్యి సంక్షేమ శాఖలో అధికారిగా ఉద్యోగం పొందాడు. తన విధులు నిర్వర్తిస్తున్నప్పుడూ సంక్షేమ నిధుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఆయన చేసిన దర్యాప్తులో డిపార్టుమెంట్ నుంచి పెద్దమొత్తంలో సంక్షేమ నిధులు మళ్లీంచబడ్డాయని తేలుతుంది. దీంతో ఎలా జరిగిందనే దిశగా..క్షణ్ణంగా దర్యాప్తు చేయగా ఏకంగా రూ. 100 కోట్ల స్కాలర్‌షిప్ స్కామ్‌ని వెలికితీశారు రాహీ. దీంతో కోర్టు ఈ కుంభకోణానికి పాల్పడ ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారు.
వారిలో నలుగురికి పదేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో వారంతా కక్షతో రాహీని హత్య చేసేందకు కుట్ర పన్నారు. అదను చూసి ఏకంగా అతడిపై ఏడు రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపారు. ఈ దాడిలో రాహి తీవ్రంగా గాయపడ్డాడు. కుడివైపు కన్ను, దవడ పూర్తిగా దెబ్బతిన్నాయి. వినికిడిని, ఒక కంటిని కోల్పోయాడు. చెప్పాలంటే అందవిహీనంగా అయ్యిపోయి సర్వం కోల్పోయినవాడుగా అయ్యిపోయాడు రాహీ. అంతేగాదు ఆ దాడి కారణంగా రాహీ నాలుగు నెలలు పైగా ఆస్పత్రిలోనే ఉన్నాడు. కనీసం ఆయన మెడికల్ లీవ్‌ని కూడా ఆమోదించకుండా అతనిపట్ల నిర్థాక్షిణ్యంగా వ్యవహరించారు అతడి పైఅధికారులు.
ఇదంతా ఒక ఎత్తు అయితే అయితే..తన నిజాయితీని అధికారులు గుర్తించకపోగా..పిచ్చోడని ముద్రవేసి సస్పెండ్ చేశారు. అతను కష్టపడి వెలికితీసిన ఆధారాలన్ని వీగిపోయాయి. ఇవన్నీ రాహీని శారీరకంగా, మానసికంగా చాలా నిరాశనిస్ప్రుహల్లోకి నెట్టేశాయి. ఒక చిన్న అధికారిగా ఉంటే ఇలాంటి స్కామ్‌లకు అడ్డుకట్టవేయలేనని భావించి..ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటాడు. విధికి ఎదురీదైనా అనుకున్న లక్ష్యం సాధించాలని నిశ్చయించకున్నాడు.
సరిగ్గా 40 ఏళ్ల వయసులో వికలాంగులో కోటలో యూపీఎస్సీ ఎగ్జామ్‌కి రాసేందుకు ప్రిపేర్ అయ్యాడు. తన చివరి ప్రయత్నంలో 2021లో ఉత్తీర్ణ సాధించి 683వ ర్యాంకు సాధించారు. ఎక్కడైతే పిచ్చోడని ముద్ర వేయించుకుని సస్పెండ్ అయ్యాడో అదే ప్రాంతానికి 15 ఏళ్ల తర్వాత ఐఏఎస్ ఆఫీసర్‌గా వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు మేజిస్ట్రేట్ అఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ మేరకు రాహీ మాట్లాడతూ..తనకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పారు. స్వప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలకు మధ్య ఎప్పుడైనా ఘర్షణ తలెత్తితే, తాను ప్రజా ప్రయోజనాలను ఎంచుకుంటానని నిర్భయంగా చెప్పారు. ప్రస్తుతం ఆయనకి 44 ఏళ్లు, తొమ్మిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. నిజంగా రింకు సింగ్ రాహీ రియల్ హీరో కదూ. అంతటి పరిస్థితి ఎదర్కొంటే..ఎవ్వరైనా చాలా అవమానంగా భావించి కుంగిపోతారు. ఆయన మాత్రం విధికే సవాలు విసిసి లేచి నిలబడి తానేంటో చూపించాడు. అతడకి కథ ఎందరికో స్ఫూర్తి.
(చదవండి: అల్జీమర్ వ్యాధికి దానిమ్మ చెక్ పెట్టగలదా? పరిశోధనలో షాకింగ్ విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment