సౌతాఫ్రికాతో తొలి టెస్టు.. ఫీల్డ్‌లో కన్పించిన రింకూ సింగ్‌! అదేంటి జట్టులో లేడుగా? | Know Reason Behind Why Rinku Singh Was Fielding In 1st Test Despite Not Being Part Of The Test Squad - Sakshi
Sakshi News home page

IND Vs SA 1st Test: సౌతాఫ్రికాతో తొలి టెస్టు.. ఫీల్డ్‌లో కన్పించిన రింకూ సింగ్‌! అదేంటి జట్టులో లేడుగా?

Published Thu, Dec 28 2023 8:15 AM | Last Updated on Thu, Dec 28 2023 9:38 AM

Why Rinku Singh Was Fielding In 1st Test Despite Not Being Part Of The Test Squad - Sakshi

సెంచూరియన్‌ వేదికగా భారత్‌-సౌతాఫ్రికా మధ్య జరగుతున్న బ్యాక్సింగ్‌ డే టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. క్రీజులో ఆఖరి టెస్టు సిరీస్‌ ఆడుతున్న డీన్‌ ఎల్గర్‌(140), మార్కో జానెసన్‌ ఉన్నాడు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్‌ కృష్ణ ఒక్క వికెట్‌ పడగొట్టారు. అంతకముందు టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. భారత  ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌(101) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.

ఇక ఇది ఇలా ఉండగా.. రెండో రోజు ఆట సందర్భంగా భారత ఆటగాడు రింకూ సింగ్‌ సబ్‌స్ట్యూట్‌ ఫీల్డర్‌గా వచ్చి అందరని ఆశ్చర్యపరిచాడు. ఈ టెస్టు సిరీస్‌ ప్రధాన జట్టులోని రింకూ ఫీల్డింగ్‌కు ఎలా వచ్చాడని అందరూ తెగ చర్చించుకున్నారు. రింకూను సెలక్టర్లు దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లకు మాత్రమే ఎంపికచేశారు. అయితే టెస్టు సిరీస్‌కు ఎంపికైన యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయం కారణంగా ఆఖరి నిమిషంలో దూరమయ్యాడు.

దీంతో అతడి స్ధానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే దక్షిణాఫ్రికా-ఏతో సిరీస్‌కు అభిమన్యు ఈశ్వరన్‌ను భారత- ఏ జట్టులో భాగం చేశారు. ఈ క్రమంలోనే రింకూ సింగ్‌ టీమిండియా సీనియర్‌ జట్టుతో పాటు దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. దీంతో రోహిత్‌ స్ధానంలో సబ్‌స్ట్యూట్‌ ఫీల్డర్‌గా రింకూ కన్పించాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన రింకూ అకట్టుకున్నాడు. అంతకుముం‍దు ప్రోటీస్‌తో టీ20 సిరీస్‌లోనూ దుమ్మురేపాడు.
చదవండి: IND vs AFG: అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియా కొత్త కెప్టెన్‌ అతడే!? రోహిత్‌ డౌటే?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement