పొట్టి క్రికెట్‌లో టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా ఎవరికీ సాధ్యంకాని రికార్డులతో దూసుకుపోతున్నాడు. తాజాగా రింకూ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఐసీసీ పుల్ మెంబర్ జట్లలో 10 టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక స్ట్రయిక్‌రేట్, సగటు కలిగిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
Rinku Singh is here to rule!🔥 pic.twitter.com/4ro8aF6DWN
— CricTracker (@Cricketracker) January 16, 2024
రింకూ తన 10 ఇన్నింగ్స్‌ల్లో 176.07 స్ట్రయిక్‌రేట్‌తో 71.75 సగటున ఓ హాఫ్ సెంచరీ సాయంతో 287 పరుగులు చేశాడు. రింకూ 10 ఇన్నింగ్స్‌ల్లో ఆరింట నాటౌట్‌గా నిలిచాడు. రింకూ ఖాతాలో 29 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. ఈ గణాంకాలు చూసి పొట్టి క్రికెట్‌లో రింకూను మించినోడే లేడని భారత క్రికెట్ అభిమానులు అంటున్నారు. 10 టీ20 ఇన్నింగ్స్‌ల అనంతరం అత్యధిక సగటు, స్ట్రయిక్‌రేట్ కలిగిన ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది.
- రింకూ సింగ్-176.07 స్ట్రయిక్‌రేట్‌తో 71.75 సగటు
- మిస్బా ఉల్ హాక్- 135 స్ట్రయిక్‌రేట్‌తో 67.60 సగటు
- డెవాన్ కాన్వే- 151 స్ట్రయిక్‌రేట్‌తో 65.43 సగటు
- కేఎల్ రాహుల్- 151 స్ట్రయిక్‌రేట్‌తో 56.75 సగటు
- ఆండ్రూ సైమండ్స్- 170 స్ట్రయిక్‌రేట్‌తో 56.17 సగటు
- బాబర్ ఆజమ్- 123 స్ట్రయిక్‌రేట్‌తో 54.86 సగటు
అంతర్జాతీయ టీ20ల్లో రింకూ సింగ్ స్కోర్లు..
- ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20 9 నాటౌట్
- ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20 16 నాటౌట్
- సౌతాఫ్రికాతో మూడో టీ20 14
- సౌతాఫ్రికాతో రెండో టీ20 68 నాటౌట్
- ఆస్ట్రేలియాతో ఐదో టీ20 6
- ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 46
- ఆస్ట్రేలియాతో రెండో టీ20 31 నాటౌట్
- ఆస్ట్రేలియాతో తొలి టీ20 22 నాటౌట్
- నేపాల్‌తో టీ20 (ఆసియా క్రీడలు) 37 నాటౌట్
- ఐర్లాండ్‌తో రెండో టీ20 38
Comments
Please login to add a commentAdd a comment