
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి పాలైన టీమిండియా ఇప్పుడు మరో విదేశీ పర్యటనకు సిద్దమైంది. వచ్చె నెలలో భారత జట్టు కరీబియన్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య వెస్టిండీస్‌తో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
తొలుత టెస్టు సిరీస్ జరగనుంది. డొమెనికా వేదికగా జూలై 12 నుంచి ఈ టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీ20 సిరీస్‌కు మాత్రం జూలై మొదటి వారంలో బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది.
కోహ్లి, రోహిత్‌కు విశ్రాంతి..
ఇక టీ20 సిరీస్‌కు స్టార్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇవ్వాలని భారత సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో యువ సంచలనం యశస్వీ జైశ్వాల్, ఐపీఎల్ హీరో రింకూ సింగ్‌కు టీ20 జట్టులోఅవకాశం ఇవ్వాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు టైమ్స్ ఇండియా తమ రిపోర్ట్‌లో పేర్కొంది.
అదే విధంగా ఈ సిరీస్‌లో రోహిత్ స్ధానంలో హార్దిక్ భారత జట్టుకు సారధ్యం వహించే ఛాన్స్ ఉంది. కాగా ఐపీఎల్-2023లో యశస్వీ జైశ్వాల్, రింకూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ ఏడాది సీజన్‌లో జైశ్వాల్ 625 పరుగులు చేయగా.. రింకూ 474 పరుగులు సాధించాడు. ఇక ఇప్పటికే విండీస్‌తో టెస్టు జట్టులో జైశ్వాల్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: Sunil Gavaskar: ధోనీ కాదు.. ‘ఒరిజినల్’ కెప్టెన్ కూల్ అతడే