రింకూ సింగ్ (PC: IPL/BCCI)
ఐపీఎల్-2023లో సత్తా చాటిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ కల త్వరలోనే నెరవేరనుంది. టీమిండియా జెర్సీ ధరించాలన్న అతడి ఆశ తీరనుంది. కాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లతో చెలరేగిన రింకూ.. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 474 పరుగులు సాధించాడు.
కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచిన రింకూ.. ఈ సీజన్‌లో అత్యధిక రన్స్ స్కోర్ చేసిన వీరుల జాబితాలో టాప్-10(తొమ్మిదో స్థానం)లో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికవుతాడని భావించినప్పటికీ అతడికి మొండి చేయి ఎదురైంది.
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్, ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మలకు విండీస్ విమానం ఎక్కే అవకాశమిచ్చారు సెలక్టర్లు. దీంతో రింకూకు అన్యాయం జరిగిందని అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఆసియా క్రీడల రూపంలో అతడికి లక్కీ ఛాన్స్ వచ్చింది.
చైనా వేదికగా సెప్టెంబరు 28 నుంచి ఆరంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌కు ఎంపిక చేసిన భారత ద్వితీయ శ్రేణి పురుషుల జట్టులో రింకూకు స్థానం లభించింది. దీంతో టీమిండియాకు ఆడాలన్న అతడి ఆశయం నెరవేరనుంది. ఇదిలా ఉంటే.. రెవ్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో రింకూ తన రోల్‌మోడల్ ఎవరో రివీల్ చేశాడు.
‘‘సురేశ్ రైనా నాకు ఆదర్శం. భయ్యాతో నేను కాంటాక్ట్‌లో ఉంటాను. ఐపీఎల్ కింగ్ తను. ఎల్లప్పుడూ నాకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటాడు. నా కెరీర్ ఇలా సాగడంలో తన సహాయం ఎంతో ఉంది. భజ్జూ పా(హర్భజన్ సింగ్) కూడా నాకు సాయం చేశాడు. వాళ్లిద్దరు నాకు అండగా నిలిచారు. వాళ్లకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.
ఇలాంటి స్టార్ ఆటగాళ్లు మనతో మాట్లాడితే మనకు మోటివేషన్ లభిస్తుంది’’ అని ఉత్తరప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల రింకూ చెప్పుకొచ్చాడు. యూపీకి చెందిన సురేశ్ రైనా టీమిండియా స్టార్ బ్యాటర్‌గా ఎదిగాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్బుత ఆట తీరుతో మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన విషయం తెలిసిందే.
ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్‌షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).
స్టాండ్‌బై ప్లేయర్లు:
యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.
చదవండి: వచ్చేస్తున్నానని వాళ్లకు చెప్పండి: బుమ్రా భావోద్వేగం.. బీసీసీఐ స్పందన
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆసియాకప్‌కు స్టార్ ఆటగాడు దూరం!
Comments
Please login to add a commentAdd a comment