దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను సమం చేసిన భారత జట్టు.. ఇప్పుడు వన్డే సిరీస్‌కు సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 17న జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఇరు జట్లు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, యజువేంద్ర చాహల్ వంటి భారత స్టార్ ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చారు. అదే విధంగా యువ సంచలనాలు సాయిసుదర్శన్, రింకూ సింగ్‌లకు తొలిసారి భారత వన్డే జట్టులో చోటు దక్కింది.
ప్రోటీస్‌తో వన్డే సిరీస్‌లో భారత జట్టును కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో భారత ప్లేయింగ్ ఎలెవన్ ఎలా అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందో ఓ సారి పరిశీలిద్దాం.
సాయిసుదర్శన్, రింకూ సింగ్‌కు ఛాన్స్..
ఇక ఈ సిరీస్‌కు భారత రెగ్యూలర్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు సెలక్టర్లు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమిళనాడు యువ సంచలనం సాయిసుదర్శన్‌కు సెలక్టర్లు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ సాయి సుదర్శన్ జట్టులోకి వస్తే రుత్‌రాజ్ గైక్వాడ్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే ఛాన్స్ ఉంది.
అదే విధంగా టీ20ల్లో దుమ్మురేపుతున్న సిక్సర్ల కింగ్ రింకూ సింగ్ కూడా వన్డేల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ కన్పిస్తోంది. అదే విధంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న సంజూ శాంసన్‌కు కూడా తుది జట్టులో ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ శాంసన్ జట్టులోకి వస్తే తిలక్ వర్మ బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. ఆల్‌రౌండర్ల జాబితాలో అక్షర్ పటేల్‌కు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా పేస్ బౌలర్ల కోటాలో ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ వైపు జట్టు మేనెజ్‌మెంట్ మొగ్గు చూపుతోంది.
భారత తుది జట్టు(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్), సంజు శాంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment