
ఐపీఎల్-2022లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ కాస్త అసహానానికి గురయ్యాడు. మ్యాచ్ కేకేఆర్ చేతిలోకి వెళ్లిపోవడంతో మయాంక్ తన ప్రశాంతతను కోల్పోయాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన రబాడ బౌలింగ్‌లో.. తొలి బంతిని మిడ్ ఆఫ్ దిశగా వెంకటేశ్ అయ్యర్ ఆడాడు.
అయితే మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షారుఖ్ ఖాన్ బంతి సరిగ్గా అందుకువడంలో విఫలమయ్యాడు. వెంటనే అసహానానికి లోనైన మయాంక్ అగర్వాల్.. షారుఖ్ ఖాన్‌పై గట్టిగా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఏంటి మయాంక్ అలా అరుస్తున్నావు.. కెప్టెన్‌గా ఇది పనికిరాదు" అంటూ కామెంట్ చేశాడు.
చదవండి: MI VS RR: అరుదైన రికార్డుకు 64 పరుగుల దూరంలో ఉన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్
We have seen Angry Mayank there 😱 #IPL2022 #MayankAgarwal #PBKSvsKKR pic.twitter.com/iN9Q4o4DZT
— Amanpreet Singh (@AmanPreet0207) April 1, 2022