
మయాంక్ అగర్వాల్ (PC: BCCI/IPL)
ఐపీఎల్-2022లో భాగంగా సోమవారం (మే 16) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 17 పరుగుల తేడాతో పరజాయం పాలైంది. ఈ ఓటమితో ప్లే ఆఫ్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ దాదాపు నిష్క్రమించింది. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ పేసర్ కగిసో రబాడతో తన నాలుగు ఓవర్ల కోటాను కెప్టెన్ మయాంక్ అగర్వాల్ పూర్తి చేయించలేదు. అయితే మయాంక్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఆసంతృప్తి వక్య్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్‌లు వేసిన రబాడ 24 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు.
"రబాడ ఆరంభంలో పరుగులు సమర్పించుకున్నాడు. కానీ అతడొక డెత్ స్పెషలిస్ట్. అటువంటి బౌలర్‌తో తన పూర్తి కోటాను పూర్తి చేయించలేదు. మయాంక్ ఏం కెప్టెన్సీ చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. పిచ్ కొద్దిగా టర్న్ అవుతోంది. ఆ సమయంలో లియామ్ లివింగ్ స్టోన్‌ను తీసుకురావడం సరైన నిర్ణయమే. కానీ రబాడ వంటి స్టార్ బౌలర్‌తో తన అఖరి ఓవర్ వేయించి ఉంటే బాగుండేది. ఇక లివింగ్‌స్టోన్, అర్ష్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. లివింగ్‌స్టోన్, అర్ష్‌దీప్ చెరో మూడు వికెట్లు సాధించారు. తొలి బంతికే లివింగ్‌స్టోన్.. వార్నర్‌ను ఔట్ చేసి అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. ఇక అర్ష్‌దీప్ కూడా దూకుడుగా ఆడుతున్న సర్ఫరాజ్‌ను ఔట్ చేశాడు" అని యూట్యూబ్ ఛానల్‌లో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: 'దటీజ్ లార్డ్ ఠాకూర్.. ఈ సారి కూడా ధావన్‌ను ఔట్ చేశాడు'
Comments
Please login to add a commentAdd a comment