
మయాంక్ అగర్వాల్- సంజూ శాంసన్(PC: IPL/BCCI)
IPL 2022 PBKS Vs RR: ఐపీఎల్-2022లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య శనివారం మ్యాచ్ జరుగనుంది. ఇక ఆడిన పది మ్యాచ్‌లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో పట్టికలో సంజూ శాంసన్ బృందం మూడో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు.. పదింట 5 గెలిచి 10 పాయింట్లతో ఏడో స్థానంలో మయాంక్ సేన ఉంది. దీంతో ఇరు వర్గాలకు తాము ఈ సీజన్‌లో ఆడబోయే పదకొండో మ్యాచ్ కీలకంగా మారింది.
కాగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా పంజాబ్, రాజస్తాన్ మధ్య ఈ మ్యాచ్ జరుగనుంది. మరి ఇరు జట్ల ముఖాముఖి రికార్డులు, పిచ్, తుది జట్ల అంచనా తదితర వివరాలు చూద్దాం.
ఐపీఎల్ మ్యాచ్: 52- పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్
వేదిక: ముంబై, వాంఖడే స్టేడియం
సమయం: మే 7, మధ్యాహ్నం 3:30 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం
పంజాబ్, రాజస్తాన్ హెడ్ టూ హెడ్ రికార్డులు
క్యాష్ రిచ్‌లీగ్‌లో 2018 నుంచి ముఖాముఖి తలపడిన సందర్భాల్లో పంజాబ్, రాజస్తాన్ చెరో 4 మ్యాచ్‌లు గెలిచాయి. అయితే, ఓవరాల్‌గా మాత్రం 13 విజయాలతో రాజస్తాన్‌దే పంజాబ్‌పై పైచేయిగా ఉంది. పంజాబ్ 10 విజయాలకే పరిమితమైంది.
పిచ్ వాతావరణం
డే గేమ్ కాబట్టి మంచు పెద్దగా ప్రభావం చూపదు. కాబట్టి టాస్ గెలిచిన వాళ్లు ముందుగా బ్యాటింగ్ చేసినా, ఛేజింగ్‌కు వెళ్లినా పెద్దగా తేడా ఉండకపోవచ్చు. అయితే, ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. వాంఖడే మైదానంలో పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్‌కు గొప్ప రికార్డేమీ లేదు.
ఈ స్టేడియంలో తాము ఆడిన మ్యాచ్‌లలో గెలిచిన వాటికంటే ఓడినవే ఎక్కువ. మరో విశేషం ఏమిటంటే.. ఇరు జట్లు ఇక్కడ ఇప్పటి వరకు 9 పరాజయాలు నమోదు చేశాయి.
ఇక బలాబలాల విషయానికొస్తే.. జోస్ బట్లర్ ఫామ్ రాజస్తాన్‌కు సానుకూల అంశం. బౌలింగ్ విభాగంలో యజువేంద్ర చహల్, అశ్విన్, యువ బౌలర్ కుల్దీప్ సేన్ రాణించడం వారికి బలం. ఇక పంజాబ్ మీద చహల్‌కు గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఆ జట్టుతో 16 ఆడిన మ్యాచ్‌లలో చహల్ 25 వికెట్లు పడగొట్టాడు.
ఇదిలా ఉంటే.. జోస్ బట్లర్‌ను తొందరగా అవుట్ చేయగలిగితే పంజాబ్‌కు మంచి ఫలితం ఉంటుంది. ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్ మీద ధావన్, రాజపక్స, లివింగ్‌స్టోన్ చెలరేగిన విధానం సానుకూల అంశం. ఇక బౌలర్లలో రబడ ఫామ్‌లో ఉండటం కలిసి వచ్చే అంశం. అదే విధంగా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ రాజస్తాన్‌తో ఆడిన 4 మ్యాచ్‌లలో ఏకంగా పది వికెట్లు పడగొట్టడం విశేషం.
తుది జట్ల అంచనా
రాజస్తాన్ రాయల్స్:
జోస్ బట్లర్., దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్(కెప్టెన్), కరుణ్ నాయర్, షిమ్రన్ హెట్‌మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ కృష్ణ, యజువేంద్ర చహల్, కుల్దీప్ సేన్.
పంజాబ్ కింగ్స్
మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, భనుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జతేశ్ శర్మ(వికెట్ కీపర్), రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ.
చదవండి👉🏾IPL 2022: 'అతడిని భారత జట్టుకు ఎంపిక చేయండి.. బుమ్రాకు సరైన జోడి'
Dhawan ka A-1 shot 😍#SaddaPunjab #IPL2022 #PunjabKings #RishiDhawan #ਸਾਡਾਪੰਜਾਬ @rishid100 pic.twitter.com/yMlrSW0oJM
— Punjab Kings (@PunjabKingsIPL) May 7, 2022
Let the countdown for #PBKSvRR begin ⏳#PunjabKings #SaddaPunjab #IPL2022 #ਸਾਡਾਪੰਜਾਬ pic.twitter.com/4f1BujiviW
— Punjab Kings (@PunjabKingsIPL) May 7, 2022
Ready. Refreshed. Riyan. 🔥#RoyalsFamily | #HallaBol | @ParagRiyan | @DettolIndia pic.twitter.com/hutajUNJTP
— Rajasthan Royals (@rajasthanroyals) May 6, 2022