
Photo courtesy: ipl website
IPL 2022 PBKS Vs RR: ఐపీఎల్- 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. కరుణ్ నాయర్ స్థానంలో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక శనివారం(మే 7) నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ నేపథ్యంలో రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘కొన్నిసార్లు మేం టాస్ ఓడిపోయాం. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. అయినా మాది సమతుల్యమైన జట్టు.
డే మ్యాచ్ కాబట్టి స్పిన్నర్లకు అనుకూలించవచ్చు’’ అని పేర్కొన్నాడు. ఇక కరుణ్ నాయర్ స్థానంలో యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. కాగా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా పంజాబ్, రాజస్తాన్ తలపడుతున్నాయి.
ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన పది మ్యాచ్‌లలో ఆరు గెలిచిన సంజూ శాంసన్ బృందం 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు.. పదింట 5 విజయాలతో మయాంక్ బృందం 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.
రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు:
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, దేవ్‌దత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్‌మెయిర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ కృష్ణ, యజువేంద్ర చహల్, కుల్దీప్ సేన్.
పంజాబ్ కింగ్స్
జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, భనుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ.
చదవండి👉🏾Kieron Pollard: పొలార్డ్‌పై వేటు తప్పదు.. ఇకపై అతడికి అవకాశం ఉండదు!