IPL 2022: సన్‌రైజర్స్‌పై 5 వికెట్ల తేడాతో పంజాబ్‌ ఘన విజయం | IPL 2022: PBKS Vs SRH Match Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IPL 2022: సన్‌రైజర్స్‌పై 5 వికెట్ల తేడాతో పంజాబ్‌ ఘన విజయం

Published Sun, May 22 2022 7:07 PM | Last Updated on Sun, May 22 2022 11:01 PM

IPL 2022: PBKS Vs SRH Match Live Updates And Highlights - Sakshi

PC: IPL.Com

ఐపీఎల్‌-2022 అఖరి లీగ్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై పంజాబ్‌ కింగ్స్‌ ఐదు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి సునాయసంగా చేధించింది. పంజాబ్‌ బ్యాటర్లలో లివింగ్‌ స్టోన్‌(49), ధావన్‌(39) పరుగులతో రాణించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో ఫజల్హాక్ ఫరూకీ రెండు,ఉమ్రాన్‌ మాలిక్‌, సుచిత్‌,వాషింగ్టన్ సుందర్‌ తలా వికెట్‌ సాధించారు.

అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో అభిషేక్‌ శర్మ(43), రొమారియో షెపర్డ్(26),వాషింగ్టన్ సుందర్(25) పరుగులతో రాణించారు. ఇక పంజాబ్‌ బౌలర్లలో నాథన్ ఎల్లిస్,హర్‌ప్రీత్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టగా.. రబాడ ఒక్క వికెట్‌ సాధించాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
112 పరుగుల వద్ద పంజాబ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 39 పరుగులు చేసిన ధావన్‌.. ఫజల్హాక్ ఫరూకీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

12 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 109/3
12 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ కింగ్స్‌ మూడు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో లివింగ్‌స్టోన్‌(24),ధావన్‌(38) పరుగులతో ఉన్నారు.

9 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 92/3
71 పరుగుల వద్ద పంజాబ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మయాంక్‌ అగర్వాల్‌ ఔటయ్యాడు. 9 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 92/3

రెండో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
66 పరుగుల వద్ద పంజాబ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 19 పరుగులు చేసిన షారుఖ్ ఖాన్.. ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 7 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 68/2

6 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 62/1
6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ వికెట్‌ నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో ధావన్‌(24), షారుఖ్ ఖాన్(15) పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌
28 పరుగుల వద్ద పంజాబ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 23 పరుగులు చేసిన బెయిర్‌స్టో.. ఫజల్హాక్ ఫరూకీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.
2 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 22/0
2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ కింగ్స్‌ వికెట్‌ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. క్రీజులో బెయిర్‌ స్టో(21), ధావన్‌(1) పరుగులతో ఉన్నారు.

నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన ఎస్‌ఆర్‌హెచ్‌..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో అభిషేక్‌ శర్మ(43), రొమారియో షెపర్డ్(26),వాషింగ్టన్ సుందర్(25) పరుగులతో రాణించారు. ఇక పంజాబ్‌ బౌలర్లలో నాథన్ ఎల్లిస్,హర్‌ప్రీత్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టగా.. రబాడ ఒక్క వికెట్‌ సాధించాడు.

18 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 135/5
18 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్‌ 5 వికెట్లు కోల్పోయి 135పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(19) రొమారియో షెపర్డ్(13) పరుగలతో క్రీజులో ఉన్నారు.

15 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 99/5
15 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్‌ 5 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(3) రొమారియో షెపర్డ్(1) పరుగలతో క్రీజులో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
76 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 43 పరుగులు చేసిన అభిషేక్‌ శర్మ.. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
61 పరుగులు వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసిన త్రిపాఠి.. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 62/2

6 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 43/1
6 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ నష్టానికి 43 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్‌ శర్మ(25), రాహుల్‌ త్రిపాఠి(13) పరుగులతో ఉన్నారు,

తొలి వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
14 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 4 పరుగులు చేసిన గార్గ్‌..రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

2 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 9/0
2 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వికెట్‌ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో ప్రియమ్‌ గార్గ్‌(4), అభిషేక్‌ శర్మ(5) పరుగులతో ఉన్నారు.

ఐపీఎల్‌-2022 అఖరి లీగ్‌ మ్యాచ్‌లో వాంఖడే వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌కు కేన్‌ విలియమ్సన్‌ దూరం కావడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌గా భువనేశ్వర్‌ కుమార్‌ వ్యవహరిస్తున్నాడు.

తుది జట్టు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
అభిషేక్ శర్మ, ప్రియాం గార్గ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (వికెట్‌ కీపర్‌), రొమారియో షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్‌), ఫజల్హాక్ ఫరూకీ, ఉమ్రాన్ మాలిక్

పంజాబ్‌ కింగ్స్‌
జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్‌), షారుక్ ఖాన్, జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, ప్రేరక్ మన్కడ్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement