PC: IPL Twitter
Donald Trump Inauguration Live Updates..👉రిపబ్లికన్ పార్టీ డ...
వాషింగ్టన్: మరికొన్ని గంటల్లో అమెరి...
దావోస్: ఏపీలో మంత్రులు, టీడీపీ నేతలు ...
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన...
బ్రిటిష్ సింగర్ క్రిస్ మార్టిన్ ...
వైఎస్సార్, సాక్షి: టీడీపీ జాతీయ కార్�...
తిరుపతి, సాక్షి: తిరుమలలో వరుస ఘటనలను...
తిరుపతి, సాక్షి: చంద్రగిరి మండలంలో ఘో�...
గాజా శాంతి ఒప్పందం వేళ.. ఇజ్రాయెల్ ప్...
బెంగళూరు: ఏరో ఇండియా షో 2025 నేపథ్యంలో బ�...
కోల్‌కతా ఆర్జీకర్ మెడికో హత్యాచార క...
‘‘సర్.. నా వయసు 24 ఏళ్లు. నేనింకా చిన్న�...
‘‘ఉద్యోగాలిప్పిస్తామని యువతకు కుచ్�...
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: క్రికె�...
ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి క�...
Published Tue, May 3 2022 7:02 PM | Last Updated on Tue, May 3 2022 11:10 PM
PC: IPL Twitter
IPL 2022: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లైవ్ అప్డేట్స్
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 16 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శిఖర్ ధావన్ 62 పరుగులతో నిలకడ చూపించగా.. ఆఖర్లో లివింగ్‌స్టోన్ 10 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 30 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ విజయాన్ని సులువు చేశాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, ఫెర్గూసన్ చెరొక వికెట్ తీశారు.
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయానికి చేరువ అయింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 15 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 62, లివింగ్‌స్టోన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 35, బానుక రాజపక్స 21 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు జానీ బెయిర్ స్టో ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు.
144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన జానీ బెయిర్ స్టో మహ్మద్ షమీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ 48 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 65 పరుగులు నాటౌట్ రాణించడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సుదర్శన్ మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. సాహా 21 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ 4 వికెట్లు పడగొట్టాడు.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. తాజాగా రబాడ బౌలింగ్‌లో వరుస బంతుల్లో రాహుల్ తెవాటియా(11), రషీద్ ఖాన్(0)లను వెనక్కి పంపాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది.
15 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 40, రాహుల్ తెవాటియా 7 పరుగులతో ఆడుతున్నారు.
9 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. సుదర్శన్ 10, మిల్లర్ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఒక్క పరుగు మాత్రమే చేసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా రిషి ధవన్ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన సాహా రబాడ బౌలింగ్‌లో మయాంక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు 9 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించిన గిల్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. రిషి ధవన్ డైరెక్ట్ హిట్‌కు గిల్ వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలు, కేవలం ఒక్క ఓటమితో ఎదురులేకుండా దూసుకెళ్తున్న గుజరాత్‌ను పంజాబ్ కింగ్స్ ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి.
ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరి పంజాబ్ గుజరాత్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేక తలొగ్గుతుందా అనేది చూడాలి
Comments
Please login to add a commentAdd a comment