
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమ�...
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా...
విజయవాడ, సాక్షి: గ్రూప్ 2 మెయిన్స్ ప�...
గుంటూరు, సాక్షి: లాభాల బాటలో నడిచిన ఫై...
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్�...
ఈ భూమ్మీద అత్యంత ధనికుడు ఎవరు?.. ప్రస్�...
నల్లగొండ: ఎస్ఎల్బీసీ పనుల్లో శనివారం...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్త...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇది కాల�...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనా...
సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల క్రిత�...
పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రిళ్లు మ...
గుంటూరు, సాక్షి: తనపై తప్పుడు కేసు నమ�...
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కర�...
న్యూఢిల్లీ: అమెరికా 21 మిలియన్ డాలర్ల...
Published Fri, Apr 8 2022 7:01 PM | Last Updated on Fri, Apr 8 2022 8:06 PM
IPL 2022: పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ లైవ్ అప్డేట్స్
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆఖరి రెండు బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో రాహుల్ తెవాటియా రెండు సిక్స్‌లు కొట్టి జట్టును గెలిపించాడు. అంతకముందు శుబ్‌మన్ గిల్ 96 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. హార్దిక్ పాండ్యా 27 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడ 2, రాహుల్ చహర్ ఒక వికెట్ తీశాడు. కాగా గుజరాత్ టైటాన్స్‌కు ఇది హ్యాట్రిక్ విజయం కావడం విశేషం.
గుజరాత్ టైటాన్స్ వరుస ఓవర్లలో గిల్(96), పాండ్యా(27) వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. విజయానికి 4 బంతల్లో 17 పరుగులు చేయాల్సి ఉంది.
నిలకడగా ఆడుతున్న సాయి సుదర్శన్(35) రాహుల్ చహర్ బౌలింగ్‌లో మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ రెండు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. గిల్ 89, హార్దిక్ పాండ్యా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నాడు. 48 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 84 పరుగులతో ఆడుతున్న గిల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. సాయి సుదర్శన్ 35 పరుగులతో గిల్‌కు సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం గుజరాత్ వికెట్ నష్టానికి 128 పరుగులు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. గిల్ 58, సాయి సుదర్శన్ 23 పరుగులతో ఆడతున్నారు.
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఆరు పరుగులు చేసిన మాథ్యూ వేడ్ రబాడ బౌలింగ్‌లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. గిల్ 25, సాయి సుదర్శన్ 5 పరుగులతో ఆడుతున్నారు.
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ 27 బంతుల్లో 64 పరుగలుతో విధ్వంసం సృష్టించగా.. ధావన్ 35 పరుగులు చేశాడు. ఆఖర్లో రాహుల్ చహర్ 14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 22 పరుగులు చేయడంతో పంజాబ్ భారీ స్కోరు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, దర్శన్ నల్కండే 2, పాండ్యా, ఫెర్గూసన్, షమీ తలా ఒక వికెట్ తీశారు.
పంజాబ్ కింగ్స్ రెండు ఓవర్ల వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రాహుల్ చహర్ 4, వైభవ్ అరోరా ఒక్క పరుగుతో ఆడుతున్నారు.
14 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్ 59, షారుక్ ఖాన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నాడు.
12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ 39, జితేష్ శర్మ 10 పరుగులతో ఆడతున్నారు. అంతకముందు ధావన్(35) పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
జానీ బెయిర్ స్టో(8) రూపంలో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఫెర్గూసన్ బౌలింగ్‌లో రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న బెయిర్ స్టో నిరాశ పరిచాడు. ప్రస్తుతం పంజాబ్ 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. ధావన్ 27, లివింగ్ స్టోన్ 5 పరుగులతో ఆడుతున్నారు.
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. ధావన్ 11, బెయిర్ స్టో 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఐదు పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య శుక్రవారం ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సూపర్ ఫామ్‌లో ఉండగా.. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి.. ఒక మ్యాచ్ ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment