PC: IPL/BCCI
ఐపీఎల్-2022 సీజన్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న పంజాబ్ కింగ్స్‌కు మరో గుడ్ న్యూస్ అందింది. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమైన పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్, ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో జట్టుతో చేరాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంజాబ్ కింగ్స్ వెల్లడించింది. కాగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కారణంగా తొలి మ్యాచ్‌కు బెయిర్‌స్టో దూరమయ్యాడు. టెస్టు సిరీస్ అనంతరం భారత్‌కు చేరుకున్న అతడు మూడు రోజులు పాటు క్వారంటైన్‌లో ఉండనున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగనున్న పంజాబ్ కింగ్స్ తదుపరి మ్యాచ్‌కు బెయిర్‌స్టో దూరం కానున్నాడు.
అయితే పంజాబ్ కింగ్స్ ఆడబోయే మూడో మ్యాచ్‌కు అతడు కచ్చితంగా అందుబాటులో ఉండనున్నాడు. ఐపీఎల్-2022లో మెగా వేలంలో భాగంగా అతడిని రూ.6.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. కాగా గత మూడు సీజన్‌లలో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు బెయిర్‌స్టో ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు 28 మ్యాచ్‌లు ఆడిన బెయిర్‌స్టో 1038 పరుగులు సాధించాడు. ఇక ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
చదవండి: Dwayne Bravo: చరిత్ర సృష్టించేందుకు వికెట్ దూరంలో..
Comments
Please login to add a commentAdd a comment