
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో అద్భుతమైన రనౌట్‌తో మెరిశాడు. లక్నో ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన ఆర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా డీప్ స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో తొలి రన్ పూర్తి చేసుకున్న కృనాల్ పాండ్యా, దీపక్ హుడా రెండో పరుగు కోసం ప్రయత్నించారు. అయితే డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న బెయిర్‌స్టో వేగంగా బంతిని అందుకుని నాన్‌స్టైకర్ ఎండ్ వైపు డైరక్ట్ త్రో చేశాడు.
నాన్‌స్టైకర్ ఎండ్ వైపు పరిగెత్తిన దీపక్ హుడా క్రీజులోకి రాకముందే బంతి వికెట్లను గిరాటేయడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 20 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.
చదవండి: PBKS Vs LSG: చెత్తగా ఆడారు.. టీమ్‌ను అమ్మిపారేయండి.. అప్పుడే!
— Vaishnavi Sawant (@VaishnaviS45) April 29, 2022