వన్డే ప్రపంచకప్-2023లో ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు మరో బిగ్‌షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ టిమ్ సౌథీ గాయం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు సౌథీ కూడా దూరం కావడం కివీస్ నిజంగా గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి.
కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా సౌథీ బొటనవేలు గాయమైంది. వెంటనే సిరీస్ మధ్యలో స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే వరల్డ్‌కప్ జట్టు ప్రకటనకు ముందు సౌథీ ఫిట్‌గా ఉన్నాడని కివీస్ ప్రకటించింది. కానీ భారత్‌కు వచ్చిన సౌథీ ఇంకా గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం.
అతడు పూర్తిగా కోలుకోవడానికి మరో పది రోజుల సమయం పట్టనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్‌తో జరిగిన వామాప్ మ్యాచ్‌లో కూడా సౌథీ బరిలోకి దిగలేదు. ఈ క్రమంలో అతడి స్ధానంలో జామీసన్ తొలి మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఆరంభ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి.
న్యూజిలాండ్ వరల్డ్ కప్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్.
చదవండి: కొంచెం బాధగా ఉంది.. నాకు అలవాటు అయిపోయింది: చాహల్
Comments
Please login to add a commentAdd a comment