ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య వరల్డ్‌కప్ తొలి మ్యాచ్.. హాట్ ఫేవరేట్‌గా ఇంగ్లీష్ జట్టు. కివీస్ ముందు 283 పరుగుల భారీ లక్ష్యం.. రెండో ఓవర్‌లోనే న్యూజిలాండ్ వికెట్ డౌన్. దీంతో కివీస్ పతనం మొదలైందని అనుకున్నారంతా. ఈ సమయంలో తొలిసారి వరల్డ్‌కప్ ఆడుతున్న 23 ఏళ్ల కుర్రాడు క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లీష్ పేస్ బౌలర్లను ఇతడేం ఆడుతాడు? ఒకట్రెండు ఓవర్లలో ఔటైపోతాడని అంతా భావించారు.
కానీ విలియమ్సన్ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ యువ సంచలనం అందరి అంచనాలను తలకిందలూ చేస్తూ విధ్వంసం సృష్టించాడు. అతడే కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర. మొదటి వరల్డ్‌కప్ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి చరిత్రకెక్కాడు. అతడి పేరు ప్రస్తుతం మారుమ్రోగిపోతుంది.
తొలి మ్యాచ్‌లోనే అద్భుత సెంచరీ..
రచిన్ రవీంద్రకు ఇదే తొలి వరల్డ్‌కప్. ప్రపంచకప్ అరంగేట్ర మ్యాచ్‌లోనే తన అద్భుత ఇన్నింగ్స్‌తో అందరని అకట్టుకున్నాడు. ఇంగ్లండ్ స్టార్ బౌలర్లు వోక్స్, మార్క్ వుడ్‌కు రవీంద్ర చుక్కలు చూపించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 96 బంతులు ఎదుర్కొన్న రవీంద్కర 1 ఫోర్లు, 5 సిక్స్‌లతో 123 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
ఓపెనర్ డెవాన్ కాన్వేతో కలిసి రెండో వికెట్‌కు 273 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని రవీంద్ర నెలకొల్పాడు. బౌలింగ్‌లో కూడా ఓ కీలక వికెట్ పడగొట్టాడు. ఈ అద్బుత ప్రదర్శనకు గానూ రవీంద్రకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్‌కే చుక్కలు చూపించిన రవీంద్ర గురించి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.
ఎవరీ రచిన్ రవీంద్ర..?
23 ఏళ్ల రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు భారతీయులే. బెంగళూరుకి చెందిన రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి, 1990ల్లోనే న్యూజిలాండ్‌కి వెళ్లి అక్కడ స్ధిరపడ్డారు. రవీంద్ర కూడా అక్కడే పుట్టాడు. 2021లో టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌తో రవీంద్ర న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
కాగా రవీంద్ర న్యూజిలాండ్‌లో ఉన్నప్పటికీ.. క్రికెట్‌లో మెళకువలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే నేర్చుకున్నాడు. ప్రతీ ఏడాది అనంతపురంకు వచ్చి రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్‌లో ట్రైనింగ్ పొందేవాడు. అంతేకాకుండా స్ధానికంగా క్రికెట్ టోర్నీలు కూడా రచిన్ ఆడేవాడు. కాగా అతడి తండ్రికి న్యూజిలాండ్ లో హాట్ హాక్స్ పేరుతో క్రికెట్ క్లబ్ ఉంది. దీంతో కొంతమంది న్యూజిలాండ్ ఆటగాళ్లతో రవీంద్ర అనంతపురంకు వచ్చి క్రికెట్ ఆడేవాడట.
ఆ పేరు ఎలా వచ్చిందంటే?
రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తికి భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ అంటే ఎంతో ఇష్టం. దీంతో తన ఆరాధ్య క్రికెటర్ల పేర్లు వచ్చేలా రచిన్ రవీంద్రకు కృష్ణమూర్తి పేరు పెట్టాడు.
రాహుల్ ద్రవిడ్ పేరు నుంచి 'రా'.. సచిన్ పేరు నుంచి 'చిన్' తీసుకుని రచిన్అనే పేరు తన కొడుకుకు పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు రచిన్ రవీంద్ర 3 టెస్ట్‌లు, 12 వన్డేలు, 18 టీ20లు న్యూజిలాండ్ తరపున ఆడాడు. కాగా ఇదే అతడికి తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమానార్హం.
చదవండి: Asian games 2023: అదరగొట్టిన తిలక్ వర్మ..సెమీఫైనల్లో బంగ్లా చిత్తు! ఫైనల్‌కు భారత్
Comments
Please login to add a commentAdd a comment