
గాలే: న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌతీ అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు. టెస్టు ఫార్మాట్‌లో 69 సిక్సర్లు సాధించడం ద్వారా భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 19 బంతుల్లో 1 సిక్సర్ సాయంతో 14 పరుగులు చేశాడు. ఫలితంగా టెస్టు క్రికెట్‌లో సచిన్ కొట్టిన సిక్సర్ల రికార్డును సౌతీ సమం చేశాడు.
టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో బ్రెండన్ మెకల్లమ్(107) టాప్ ప్లేస్‌లో ఉండగా, గిల్ క్రిస్ట్(100) రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ 17వ స్థానంలో ఉండగా, ఇప్పుడు అతని సరసన సౌతీ చేరాడు. కాగా, సచిన్ 69 టెస్టు సిక్సర్లను సాధించడానికి 329 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, సౌతీ తన 96వ ఇన్నింగ్స్‌లోనే ఈ మార్కును చేరాడు. ఆఫ్ స్పిన్నర్ ధనంజయ డిసిల్వా బౌలింగ్‌లో సిక్స్‌ను కొట్టడం ద్వారా సౌతీ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.