టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ వెటరన్ టిమ్ సౌథీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. కివీస్ టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి సౌథీ తప్పుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో 2-0 తేడాతో న్యూజిలాండ్ ఘోర పరాభావం చూసిన తర్వాత సౌథీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
నాకు ఇష్టమైన రెడ్ బాల్ ఫార్మాట్‌లో న్యూజిలాండ్ కెప్టెన్‌గా పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నా కెరీర్‌లో జట్టును నెం1గా నిలపడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాను. ఇప్పుడు కూడా ఆటగాడిగా నావంతు పాత్ర పోషిస్తున్నాను. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఓ ప్రకటనలో సౌథీ పేర్కొన్నాడు.
కాగా గతేడాది కేన్ విలియమ్సన్ నుంచి కివీస్ టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు సౌథీ చేపట్టాడు. అయితే కెప్టెన్‌గా సౌథీ పర్వాలేదన్పించాడు. అతడి సారథ్యంలో 14 టెస్టులు ఆడిన బ్లాక్ క్యాప్స్.. ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మరో 6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మరో రెండు మ్యాచ్‌లను ఓటమితో ముగించింది.
న్యూజిలాండ్ కెప్టెన్‌గా లాథమ్..
ఇక బ్లాక్ క్యాప్స్ టెస్టు కెప్టెన్‌గా వెటరన్ వికెట్ కీపర్ టామ్ లాథమ్ బాధ్యతలు చేపట్టాడు. ఆక్టోబర్ 16 నుంచి భారత్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్టుతో కివీస్ కెప్టెన్‌గా లాథమ్ ప్రయాణం మొదలు కానుంది. లాథమ్ వన్డే, టెస్టు ఫార్మాట్‌లో కివీస్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇక భారత్‌తో కివీస్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం కివీస్ ఆక్టోబర్ 10న భారత్‌కు వచ్చే ఛాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment