పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఎనిమిదో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ మ్యాజిక్ డెలివరీతో కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. అశ్విన్ బంతిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైన లాథమ్ వికెట్ల ముందు సులువుగా దొరికిపోయాడు.
ఇన్నింగ్స్ 24వ ఓవర్‌లో అశ్విన్ మరోసారి మ్యాజిక్ చేశాడు. ఈసారి యాష్ విల్ యంగ్‌ను (18) బోల్తా కొట్టించాడు. వికెట్ల వెనుక పంత్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో యంగ్ పెవిలియన్ బాట పట్టాడు. 24 ఓవర్ల అనంతరం న్యూజిలాండ్ స్కోర్ 76/2గా ఉంది. డెవాన్ కాన్వే (38), రచిన్ రవీంద్ర క్రీజ్‌లో ఉన్నారు.
ASHWIN STRIKES IN HIS FIRST OVER 👌
- What a champion, India on charge at Pune. pic.twitter.com/oJOCsGZPAZ— Johns. (@CricCrazyJohns) October 24, 2024
కాగా, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి టీమిండియాను బౌలింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బౌలింగ్ చేస్తున్న భారత్ 76 పరుగులకే రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను డిఫెన్స్‌లోకి నెట్టేసింది.
ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ స్థానాల్లో శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ సైతం నేటి మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. పేసర్ మ్యాట్ హెన్రీ స్థానంలో మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు..
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్‌కీపింగ్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే
Comments
Please login to add a commentAdd a comment