చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్ (PC: SENZ X)
New Zealand vs Pakistan, 1st T20I: న్యూజిలాండ్ వెటరన్ పేసర్ టిమ్ సౌతీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా క్రికెట్ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. పాకిస్తాన్‌తో తొలి టీ20 సందర్భంగా సౌతీ ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు.
కాగా ఐదు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య అక్లాండ్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన షాహిన్ ఆఫ్రిది బృందం న్యూజిలాండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఈ క్రమంలో డారిల్ మిచెల్(27 బంతుల్లో 61- నాటౌట్), కెప్టెన్ విలియమ్సన్ (57) అద్భుత అర్ధ శతకాలతో మెరవగా.. కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 226 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 18 ఓవర్లకే చేతులెత్తేసింది. 180 పరుగులకు ఆలౌట్ అయి 46 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఏకైక బౌలర్‌గా రికార్డు
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో టిమ్ సౌతీ.. మహ్మద్ రిజ్వాన్(25), ఇఫ్తికర్ అహ్మద్(24) రూపంలో రెండు బిగ్ వికెట్లు తీశాడు. అబ్బాస్ ఆఫ్రిదిని అవుట్ చేసిన క్రమంలో.. అంతర్జాతీయ టీ20లలో తన 150వ వికెట్ నమోదు చేశాడు సౌతీ. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. ఇక అబ్బాస్ తర్వాత హ్యారిస్ రవూఫ్‌ను పెవిలియన్‌కు పంపిన సౌతీ తొలి టీ20లో న్యూజిలాండ్ విజయాన్ని ఖరారు చేశాడు.
నంబర్ 2 ఎవరంటే
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో 35 ఏళ్ల కివీస్ ఫాస్ట్‌బౌలర్ టిమ్ సౌతీ(151) అగ్రస్థానంలో ఉండగా.. 140 వికెట్లతో బంగ్లాదేశ్ స్పిన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ అరుదైన లిస్టులో న్యూజిలాండ్ నుంచి ఇష్ సోధి(127), మిచెల్ సాంట్నర్(105) కూడా చోటు దక్కించుకోవడం విశేషం.
చదవండి: Ind vs Afg: అందుకే 19వ ఓవర్లో బంతి అతడి చేతికి: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment