కింగ్‌స్టన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లా బ్యాటర్ మెహాది హాసన్ వికెట్ పడగొట్టి టెస్టుల్లో 300 వికెట్ల క్లబ్‌లో చేరాడు. టెస్టుల్లో 300 వికెట్ల ఘనత సాధించిన నాలుగో కివీస్ బౌలర్‌గా బౌల్ట్ నిలిచాడు. అంతే కాకుండా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో కివీస్ బౌలర్‌గా నిలిచాడు. అతడి కంటే ముందు ఆర్జే హాడ్లీ(431), డానియల్ వెటోరీ(361), టిమ్ సౌథీ(328), ఈ జాబితాలో ఉన్నారు.
అయితే 75 మ్యాచ్‌ల్లో సౌథీ ఈ ఘనత సాధించగా, బౌల్ట్ 74 మ్యాచ్‌ల్లో ఈ రికార్డు సాధించాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 521-6 వద్ద డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ లాథమ్ డబుల్ సెంచరీతో చెలరేగగా, కాన్వే సెంచరీతో మెరిశాడు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 126 పరుగులకే కూప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో 5 వికెట్లు సాధించిగా, టిమ్ సౌథీ మూడు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: Ind Vs Sa: హనుమ విహారికి నో ఛాన్స్.. పంత్‌కు అవకాశం... సిరాజ్ స్థానంలో అతడే! ఎందుకంటే..
Comments
Please login to add a commentAdd a comment