
వెల్లింగ్టన్: వర్షం తెరిపినివ్వడంతో మూడో రోజు మొదలైన న్యూజిలాండ్, బంగ్లాదేశ్ రెండో టెస్టులో ఒకే రోజు 12 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. న్యూజిలాండ్ పేస్ బౌలర్లు నీల్ వాగ్నర్ (4/28), ట్రెంట్ బౌల్ట్ (3/38) చెలరేగడంతో... బంగ్లాదేశ్ 61 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (114 బంతుల్లో 74; 10 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... లిటన్ దాస్ (49 బంతుల్లో 33; 6 ఫోర్లు), షాద్‌మన్ ఇస్లామ్ (53 బంతుల్లో 27; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.
తమీమ్, ఇస్లామ్ తొలి వికెట్‌కు 75 పరుగులు జత చేసి శుభారంభం అందించారు. అయితే ఇస్లామ్‌ను వాగ్నర్ ఔట్ చేశాక బంగ్లాదేశ్ వికెట్ల పతనం మొదలైంది. ఒకదశలో ఆరు వికెట్లకు 206 పరుగులతో ఉన్న బంగ్లాదేశ్... బౌల్ట్ ధాటికి చివరి నాలుగు వికెట్లను కేవలం నాలుగు పరుగుల తేడాలో కోల్పోవడం గమనార్హం. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి 11.4 ఓవర్లలో రెండు వికెట్లకు 38 పరుగులు చేసింది. ఓపెనర్లు జీత్ రావల్ (3), లాథమ్ (4)లను అబూ జాయెద్ ఔట్ చేశాడు. విలియమ్సన్ (10 బ్యాటింగ్), రాస్ టేలర్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment