
Tim Southee 100th Wicket In T20I Cricket.. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ టి20ల్లో చరిత్ర సృష్టించాడు. టి20 క్రికెట్‌లో 100 వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా సౌథీ రికార్డులకెక్కాడు. కాగా న్యూజిలాండ్ నుంచి ఈ ఘనత అందుకున్న తొలి బౌలర్‌గా సౌథీ నిలవడం విశేషం. టి20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లో బాబర్ అజమ్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడం ద్వారా సౌథీ టి20 క్రికెట్‌లో 100వ వికెట్ మైలురాయిని చేరుకున్నాడు.
చదవండి: WI VS SA: రసెల్ స్టన్నింగ్ త్రో.. దాదాపు 100 కిమీ వేగంతో
ఇంతకముందు టి20 క్రికెట్‌లో వంద వికెట్ల మార్క్‌ను అందుకున్న వారిలో షకీబ్ అల్ హసన్(117 వికెట్లు), లసిత్ మలింగ(107 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కాగా సౌథీ తర్వాత రషీద్ ఖాన్ 99 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్‌గా సౌథీ న్యూజిలాండ్ తరపున 79 టెస్టుల్లో 314 వికెట్లు.. 143 వన్డేల్లో 190 వికెట్లు.. 84 టి20ల్లో 100 వికెట్లు తీశాడు.
Southee claims 100th T20I wicket via @t20worldcup https://t.co/6vpJxIOwCl
— varun seggari (@SeggariVarun) October 26, 2021
Comments
Please login to add a commentAdd a comment