దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో టీ20లో 32 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కివీస్ సొంతం చేసుకుంది. ఈవిజయంతో రెండో టీ20 ఓటమికి కివీస్ ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ఱీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.
కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(56), చాప్‌మన్(51) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దుఖీ మూడు వికెట్లు పడగొట్టగా.. జహూర్ ఖాన్, జవదుల్లా తలా వికెట్ సాధించారు. అనంతరం 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులకే పరిమితమైంది.
యూఏఈ బ్యాటర్లలో ఆయాన్ ఖాన్(42) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.బ్లాక్ క్యాప్స్ బౌలర్లలో లిస్టర్ మూడు వికెట్లు, జామీసన్, శాంట్నర్, ఆశోక్ తలా వికెట్ సాధించారు. 56 పరుగులతో రాణించిన విల్‌యంగ్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.
చదవండి: చాలా సంతోషంగా ఉంది..10 ఏళ్లగా కష్టపడుతున్నా! నా తొలి మ్యాచ్‌లోనే: రింకూ
Comments
Please login to add a commentAdd a comment