UAE Vs New Zealand
-
ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్.. సిరీస్ సొంతం
దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో టీ20లో 32 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కివీస్ సొంతం చేసుకుంది. ఈవిజయంతో రెండో టీ20 ఓటమికి కివీస్ ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ఱీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(56), చాప్మన్(51) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దుఖీ మూడు వికెట్లు పడగొట్టగా.. జహూర్ ఖాన్, జవదుల్లా తలా వికెట్ సాధించారు. అనంతరం 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులకే పరిమితమైంది. యూఏఈ బ్యాటర్లలో ఆయాన్ ఖాన్(42) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.బ్లాక్ క్యాప్స్ బౌలర్లలో లిస్టర్ మూడు వికెట్లు, జామీసన్, శాంట్నర్, ఆశోక్ తలా వికెట్ సాధించారు. 56 పరుగులతో రాణించిన విల్‌యంగ్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. చదవండి: చాలా సంతోషంగా ఉంది..10 ఏళ్లగా కష్టపడుతున్నా! నా తొలి మ్యాచ్‌లోనే: రింకూ -
న్యూజిలాండ్‌కు బిగ్‌షాకిచ్చిన పసికూన.. 7 వికెట్ల తేడాతో సంచలన విజయం
న్యూజిలాండ్‌కు పసికూన యూఏఈ బిగ్‌షాకిచ్చింది. దుబాయ్ వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై యూఏఈకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. అదే విధంగా దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో యూఏఈకు ఇదే మొదటి గెలుపు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో యూఏఈ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. యూఏఈ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 144 పరుగుల మాత్రమే చేయగల్గింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో చాప్మాన్(63) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. యూఏఈ బౌలర్లలో ఆయాన్ ఖాన్ మూడు వికెట్లతో చెలరేగగా.. జవదుల్లా రెండు, నసీర్, మహ్మద్ ఫరాజుద్దీన్ తలా వికెట్ సాధించారు. వసీం కెప్టెన్ ఇన్నింగ్స్.. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 15.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యూఏఈ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ వసీం(55) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఆసీఫ్ ఖాన్(48 నాటౌట్) పరుగులతో రాణించాడు. కివీస్ బౌలర్లలో సౌథీ, శాంట్నర్, జేమీసన్ తలా వికెట్ సాధించారు. ఇక సిరీస్ డిసైడర్ మూడో టీ20 దుబాయ్ వేదికగా ఆదివారం జరగనుంది. చదవండి: సిరీస్‌పై భారత్ కన్ను The moment UAE became the first associate team to beat New Zealand...!! A proud day for UAE cricket. pic.twitter.com/v6t6MvpXfc — Mufaddal Vohra (@mufaddal_vohra) August 19, 2023 -
కివీస్‌తో సిరీస్.. కొత్త కెప్టెన్‌గా అతడు! ‘ఫాస్టెస్ట్ సెంచరీ’ వీరుడి అరంగేట్రం!
New Zealand tour of United Arab Emirates, 2023: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై కివీస్‌తో పోరు నేపథ్యంలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ సందర్భంగా తమ టీ20 కొత్త కెప్టెన్‌గా మహ్మద్ వసీం పేరును ఖరారు చేసినట్లు యూఏఈ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇంగ్లండ్ కంటే ముందు కాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్.. యూఏఈతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఆగష్టు 17, 19, 20 తేదీల్లో దుబాయ్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడు టీ20లు జరుగనున్నాయి. ఈ క్రమంలో కివీస్ వంటి పటిష్ట జట్టుతో తలపడనున్న వసీం సారథ్యంలో 16 మంది సభ్యులున్న జట్టును ఎంపిక చేసినట్లు యూఏఈ బోర్డు బుధవారం తెలిపింది. రిజ్వాన్ స్థానంలో వసీం సీపీ రిజ్వాన్ స్థానంలో వసీం యూఏఈ టీ20 జట్టును ముందుకు నడిపించనున్నట్లు పేర్కొంది. కాగా కివీస్‌తో సిరీస్ సందర్భంగా అసోసియేట్ దేశాల్లో వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన అసిఫ్ ఖాన్ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేయనున్నాడు. అతడితో పాటు.. దేశవాళీ క్రికెట్లో అదరగిట్టిన ఆల్‌రౌండర్ ఫరాజుద్దీన్, స్పిన్నర్ జశ్ గియనానీ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు యూఏఈ జట్టు: మహ్మద్ వసీం(కెప్టెన్), అలీ నాసీర్, అన్ష్ టాండన్, ఆర్యాంశ్ శర్మ, అసిఫ్ ఖాన్, అయాన్ అఫ్జల్ ఖాన్, బాసిల్ హమీద్, ఈథన్ డిసౌజా, ఫరాజుద్దీన్, జశ్ గియనానీ, జునైద్ సిద్దిఖి, లవ్‌ప్రీత్ సింగ్, మహ్మద్ జవాదుల్లా, సంచిత్ శర్మ, వ్రిత్య అరవింద్, జహూర్ ఖాన్. యూఏఈతో సిరీస్‌కు కివీస్ జట్టు: టిమ్ సౌతీ(కెప్టెన్), అది అశోక్, చాడ్ బోస్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్, జాకబ్ డఫీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, కైలీ జెమీషన్, బెన్ లిస్టర్, కోలీ మెకాంచి, జిమ్మీ నీషం, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫర్ట్, విల్ యంగ్. సిరీస్ వివరాలు ►ఆగష్టు 17, ఆగష్టు 19, ఆగష్టు 20- మూడు టీ20లు ►స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం ►దుబాయ్‌లోనే మూడు టీ20లు ►భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌లు ఆరంభం. చదవండి: అక్కడ ఒక్కరాత్రికి 4 వేలు ఉండేది.. ఆరోజు మాత్రం ఏకంగా 60 వేలు! Squad ALERT: We unveil the 16 for the #UAEvNZ series. Mohammad Waseem to captain. More details: https://t.co/Vq3aSFqIwx pic.twitter.com/cmYCucYLUb — UAE Cricket Official (@EmiratesCricket) August 16, 2023