New Zealand tour of United Arab Emirates, 2023: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై కివీస్‌తో పోరు నేపథ్యంలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ సందర్భంగా తమ టీ20 కొత్త కెప్టెన్‌గా మహ్మద్ వసీం పేరును ఖరారు చేసినట్లు యూఏఈ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
ఇంగ్లండ్ కంటే ముందు
కాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్.. యూఏఈతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఆగష్టు 17, 19, 20 తేదీల్లో దుబాయ్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడు టీ20లు జరుగనున్నాయి. ఈ క్రమంలో కివీస్ వంటి పటిష్ట జట్టుతో తలపడనున్న వసీం సారథ్యంలో 16 మంది సభ్యులున్న జట్టును ఎంపిక చేసినట్లు యూఏఈ బోర్డు బుధవారం తెలిపింది.
రిజ్వాన్ స్థానంలో వసీం
సీపీ రిజ్వాన్ స్థానంలో వసీం యూఏఈ టీ20 జట్టును ముందుకు నడిపించనున్నట్లు పేర్కొంది. కాగా కివీస్‌తో సిరీస్ సందర్భంగా అసోసియేట్ దేశాల్లో వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన అసిఫ్ ఖాన్ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేయనున్నాడు. అతడితో పాటు.. దేశవాళీ క్రికెట్‌లో అదరగిట్టిన ఆల్‌రౌండర్ ఫరాజుద్దీన్, స్పిన్నర్ జశ్ గియనానీ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు యూఏఈ జట్టు:
మహ్మద్ వసీం(కెప్టెన్), అలీ నాసీర్, అన్ష్ టాండన్, ఆర్యాంశ్ శర్మ, అసిఫ్ ఖాన్, అయాన్ అఫ్జల్ ఖాన్, బాసిల్ హమీద్, ఈథన్ డిసౌజా, ఫరాజుద్దీన్, జశ్ గియనానీ, జునైద్ సిద్దిఖి, లవ్‌ప్రీత్ సింగ్, మహ్మద్ జవాదుల్లా, సంచిత్ శర్మ, వ్రిత్య అరవింద్, జహూర్ ఖాన్.
యూఏఈతో సిరీస్‌కు కివీస్ జట్టు:
టిమ్ సౌతీ(కెప్టెన్), అది అశోక్, చాడ్ బోస్, మార్క్ చాప్‌మన్, డేన్ క్లీవర్, జాకబ్ డఫీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, కైలీ జెమీషన్, బెన్ లిస్టర్, కోలీ మెకాంచి, జిమ్మీ నీషం, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫర్ట్, విల్ యంగ్.
సిరీస్ వివరాలు
►ఆగష్టు 17, ఆగష్టు 19, ఆగష్టు 20- మూడు టీ20లు
►స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
►దుబాయ్‌లోనే మూడు టీ20లు
►భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌లు ఆరంభం.
చదవండి: అక్కడ ఒక్కరాత్రికి 4 వేలు ఉండేది.. ఆరోజు మాత్రం ఏకంగా 60 వేలు!
Squad ALERT: We unveil the 16 for the #UAEvNZ series.
— UAE Cricket Official (@EmiratesCricket) August 16, 2023
Mohammad Waseem to captain.
More details: https://t.co/Vq3aSFqIwx pic.twitter.com/cmYCucYLUb
Comments
Please login to add a commentAdd a comment