Asif Khan
-
కివీస్‌తో సిరీస్.. కొత్త కెప్టెన్‌గా అతడు! ‘ఫాస్టెస్ట్ సెంచరీ’ వీరుడి అరంగేట్రం!
New Zealand tour of United Arab Emirates, 2023: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై కివీస్‌తో పోరు నేపథ్యంలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ సందర్భంగా తమ టీ20 కొత్త కెప్టెన్‌గా మహ్మద్ వసీం పేరును ఖరారు చేసినట్లు యూఏఈ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇంగ్లండ్ కంటే ముందు కాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్.. యూఏఈతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఆగష్టు 17, 19, 20 తేదీల్లో దుబాయ్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడు టీ20లు జరుగనున్నాయి. ఈ క్రమంలో కివీస్ వంటి పటిష్ట జట్టుతో తలపడనున్న వసీం సారథ్యంలో 16 మంది సభ్యులున్న జట్టును ఎంపిక చేసినట్లు యూఏఈ బోర్డు బుధవారం తెలిపింది. రిజ్వాన్ స్థానంలో వసీం సీపీ రిజ్వాన్ స్థానంలో వసీం యూఏఈ టీ20 జట్టును ముందుకు నడిపించనున్నట్లు పేర్కొంది. కాగా కివీస్‌తో సిరీస్ సందర్భంగా అసోసియేట్ దేశాల్లో వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన అసిఫ్ ఖాన్ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేయనున్నాడు. అతడితో పాటు.. దేశవాళీ క్రికెట్లో అదరగిట్టిన ఆల్‌రౌండర్ ఫరాజుద్దీన్, స్పిన్నర్ జశ్ గియనానీ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు యూఏఈ జట్టు: మహ్మద్ వసీం(కెప్టెన్), అలీ నాసీర్, అన్ష్ టాండన్, ఆర్యాంశ్ శర్మ, అసిఫ్ ఖాన్, అయాన్ అఫ్జల్ ఖాన్, బాసిల్ హమీద్, ఈథన్ డిసౌజా, ఫరాజుద్దీన్, జశ్ గియనానీ, జునైద్ సిద్దిఖి, లవ్‌ప్రీత్ సింగ్, మహ్మద్ జవాదుల్లా, సంచిత్ శర్మ, వ్రిత్య అరవింద్, జహూర్ ఖాన్. యూఏఈతో సిరీస్‌కు కివీస్ జట్టు: టిమ్ సౌతీ(కెప్టెన్), అది అశోక్, చాడ్ బోస్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్, జాకబ్ డఫీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, కైలీ జెమీషన్, బెన్ లిస్టర్, కోలీ మెకాంచి, జిమ్మీ నీషం, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫర్ట్, విల్ యంగ్. సిరీస్ వివరాలు ►ఆగష్టు 17, ఆగష్టు 19, ఆగష్టు 20- మూడు టీ20లు ►స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం ►దుబాయ్‌లోనే మూడు టీ20లు ►భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌లు ఆరంభం. చదవండి: అక్కడ ఒక్కరాత్రికి 4 వేలు ఉండేది.. ఆరోజు మాత్రం ఏకంగా 60 వేలు! Squad ALERT: We unveil the 16 for the #UAEvNZ series. Mohammad Waseem to captain. More details: https://t.co/Vq3aSFqIwx pic.twitter.com/cmYCucYLUb — UAE Cricket Official (@EmiratesCricket) August 16, 2023 -
థ్రిల్లర్‌ను తలపించిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో తొమ్మిదో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్స్ మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ ఆఖరి బంతికి పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో యూఎస్ఏ చివరి బంతికి కనీసం ఒక్క పరుగు చేసినా మ్యాచ్ టై అయ్యేది. అయితే సంచిత్ శర్మ బౌలింగ్‌లో అరవింద్‌కు క్యాచ్ ఇచ్చి అలీ ఖాన్ ఔట్ కావడంతో యూఏఈ పరుగు తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఆఖరి ఓవర్లో యూఎస్ఏ గెలుపుకు 11 పరుగులు అవసరం కాగా, చేతిలో 3 వికెట్లు ఉన్నాయి. తొలి 3 బంతులకే 7 పరుగులు రావడంతో యూఎస్ఏ గెలుపు నల్లేరుపై నడకే అని అంతా అనుకున్నారు. అయితే యూఏఈ బౌలర్ సంచిత్ శర్మ అనూహ్యంగా పుంజుకుని నాలుగో బంతికి, ఆఖరి బంతికి వికెట్లు సాధించి, తన జట్టును గెలిపించాడు. అప్రధానమైన ఈ మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా యూఏఈ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఆసిఫ్ ఖాన్ 151 నాటౌట్.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. ఓపెనర్ ఆసిఫ్ ఖాన్ (145 బంతుల్లో 151 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోర్ చేసింది. యూఏఈ ఇన్నింగ్స్‌లో ఆసిఫ్ ఖాన్ చెలరేగగా.. ఆర్యాన్ష్ శర్మ (57), బాసిల్ హమీద్ (44) రాణించారు. యూఎస్ఏ బౌలర్లలో అలీ ఖాన్ 2, నోష్తుష్ కెంజిగే, నేత్రావాల్కర్ తలో వికెట్ పడట్టారు. రాణించిన జోన్స్, మోనాంక్ పటేల్, గజానంద్.. 309 పరుగుల లక్ష్య ఛేదనలో యూఏస్ఏ సైతం అద్భుతంగా పోరాడింది. ఆరోన్ జోన్స్ (75), మోనాంక్ పటేల్ (61), గజానంద్ సింగ్ (69) అర్ధసెంచరీలతో రాణించడంతో యూఏస్ఏ విజయతీరాల వరకు చేరింది. అయితే ఆఖరి బంతికి రెండు పరుగులు చేయలేక ఆ జట్టు ఓటమిపాలై, క్వాలిఫయర్స్‌లో చివరి స్థానంలో నిలిచింది. యూఏఈ బౌలర్లలో సంచిత్ శర్మ 3, సిద్దిఖీ, అలీ నసీర్ తలో 2 వికెట్లు, జవాదుల్లా, అఫ్జల్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. -
నేడే విడుదల
అసిఫ్ ఖాన్, మౌర్యాని జంటగా నటించిన చిత్రం ‘నేడే విడుదల’. ఈ సినిమా ద్వారా రామ్ రెడ్డి పన్నాల దర్శకునిగా పరిచయమవుతున్నారు. నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్ నిర్మించిన ఈ సినిమా ప్రీ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఆసక్తికరమైన కథ, ఆలోచింపచేసే కథనంతో పాటు ఆహ్లాదపరిచే సంభాషణలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో సినిమా ఫస్ట్ లుక్, సాంగ్‌ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: అజయ్ అరసాడ, కెమెరా: సిహిచ్ మోహన్ చారి. -
నయీం అనుచరుడికి 14 రోజుల రిమాండ్
కరీంనగర్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో అతని అనుచరుడు ఆసిఫ్‌ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని శుక్రవారం కోరుట్ల కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం ఈ నెల 16 వరకు ఆసిఫ్ ఖాన్ కు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతన్ని కరీంనగర్ జైలుకు తరలించారు. -
శారద స్కాంలో టీఎంసీ మాజీ నేత అరెస్ట్
కొల్కత్తా: శారద చిట్ స్కాం కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మాజీ నాయకుడు అసీఫ్ ఖాన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. శుక్రవారం ఉదయం ఖాన్‌ను కొల్‌కత్తాలో బిదాన్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు. శారద చిట్ స్కాం కేసులో టీఎంసీకి చెందిన బడా నాయకుల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకు సంబంధించిన సమగ్ర సమాచారం అసీఫ్ ఖాన్‌కు తెలిసి ఉండవచ్చని సీబీఐ భావిస్తుంది. ఆ క్రమంలో అసీఫ్ ఖాన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. గతంలో కూడా ఈ కేసులో అసీఫ్ ఖాన్‌ను సీబీఐ పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. అయితే శారద స్కాంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్ర ఉందంటూ మీడియా కథనాలపై ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం ఓ సభలో ఘాటుగా స్పందించారు. ఓ మీడియా వర్గం తమ పార్టీ వారిని దొంగలుగా చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. చిట్ ఫండ్ కంపెనీల నుంచి తమ పార్టీ నాయకులు ఎవరు ఒక్కపైసా కూడా తీసుకోలేదని మమతా స్పష్టం చేశారు.