న్యూజిలాండ్‌కు పసికూన యూఏఈ బిగ్‌షాకిచ్చింది. దుబాయ్ వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై యూఏఈకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. అదే విధంగా దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో యూఏఈకు ఇదే మొదటి గెలుపు.
దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో యూఏఈ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. యూఏఈ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 144 పరుగుల మాత్రమే చేయగల్గింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో చాప్‌మాన్(63) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. యూఏఈ బౌలర్లలో ఆయాన్ ఖాన్ మూడు వికెట్లతో చెలరేగగా.. జవదుల్లా రెండు, నసీర్, మహ్మద్ ఫరాజుద్దీన్ తలా వికెట్ సాధించారు.
వసీం కెప్టెన్ ఇన్నింగ్స్..
145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 15.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యూఏఈ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ వసీం(55) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఆసీఫ్ ఖాన్(48 నాటౌట్) పరుగులతో రాణించాడు. కివీస్ బౌలర్లలో సౌథీ, శాంట్నర్, జేమీసన్ తలా వికెట్ సాధించారు. ఇక సిరీస్ డిసైడర్ మూడో టీ20 దుబాయ్ వేదికగా ఆదివారం జరగనుంది.
చదవండి: సిరీస్‌పై భారత్ కన్ను
The moment UAE became the first associate team to beat New Zealand...!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 19, 2023
A proud day for UAE cricket. pic.twitter.com/v6t6MvpXfc
Comments
Please login to add a commentAdd a comment