Muhammad Waseem
-
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదు
-
సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు.. అనంతపురం మేయర్ సీరియస్ వార్నింగ్
-
ఐసీసీ అవార్డు రేసులో పాకిస్తాన్ స్టార్ బౌలర్..
ఏప్రిల్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్ చేసింది. ఈ లిస్ట్‌లో పాకిస్తాన్ స్టార్ పేసర్ పేసర్ షహీన్ అఫ్రిది, నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్, యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీమ్ ఉన్నారు. వీరిముగ్గురూ ఏప్రిల్ నెలలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. అఫ్రిది విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్లొ అదరగొట్టాడు.ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన షాహీన్.. 8 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఐసీసీ అతడిని ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డకు నామినేట్ చేసింది. ఇక నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్.. ఒమన్ పర్యటనలో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ఒమన్‌తో టీ20 సిరీస్‌ను నమీబియా సాధించడంలో ఎరాస్మస్ కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీం సైతం ఏప్రిల్ నెలలో అదరగొట్టాడు. ఒమన్ వేదికగా జరిగిన ఏసీసీ ప్రీమియర్ కప్‌లో వసీం దుమ్ములేపాడు. ఓవరాల్‌గా ఏప్రిల్ నెలలో వసీం 44.83 సగటుతో 269 పరుగులు చేశాడు. ఇక మహిళలల విభాగంలో శ్రీలం కెప్టెన్ చమరి అతపట్టు, వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్, దక్షిణాఫ్రికా స్టార్ లారా వోల్వార్డ్ట్ ఏప్రిల్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు రేసులో ఉన్నారు. -
విజృంభించిన వసీం.. యూఏఈ చేతిలో స్కాట్లాండ్ చిత్తు
యూఏఈతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం స్కాట్లాండ్ జట్టు దుబాయ్‌లో పర్యటిస్తుంది. పర్యటనలో భాగంగా నిన్న (మార్చి 11 జరిగిన తొలి మ్యాచ్‌లో యూఏఈ స్కాట్లాండ్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగుల నామమాత్రపు స్కోర్ చేయగా.. యూఏఈ 17.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ముహమ్మద్ వసీం మెరుపు ఇన్నింగ్స్ (43 బంతుల్లో 68 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి యూఏఈని గెలిపించాడు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌లో జార్జ్ మున్సే (49 బంతుల్లో 75; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. మైఖేల్ లీస్క్ (19), జాక్ జార్విస్ (21) రెండంకెల స్కోర్లు చేశారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖీ (4-0-14-3) అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఆయాన్ ఖాన్ (4-0-19-2), బాసిల్ హమీద్ (4-0-26-2) పర్వాలేదనిపించారు. యూఏఈ ఇన్నింగ్స్‌లో ముహమ్మద్ వసీంతో పాటు తినష్ సూరి (35 బంతుల్లో 37; 4 ఫోర్లు), అలీషాన్ షరాఫు (29 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో జాక్ జార్విస్, క్రిస్ గ్రీవ్స్లకు తలో వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 13న జరుగనుంది. -
చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్.. రోహిత్, గేల్‌కు కూడా సాధ్యం కాని ఘనత సొంతం
పొట్టి ఫార్మాట్లో యూఏఈ కెప్టెన్, పాకిస్తాన్ ఆటగాడు ముహమ్మద్ వసీం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఏ ఆటగాడికి సొంతం కాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో 100 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి అంతర్జాతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో సిక్సర్ల వీరులుగా పేరున్న రోహిత్ శర్మ, క్రిస్ గేల్ సైతం ఈ ఫీట్ సాధించలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన రెండో టీ20లో వసీం ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదిన వసీం.. 2023 క్యాలెండర్ ఇయర్లో 100 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది మొత్తం 47 అంతర్జాతీయ టీ20లు ఆడిన వసీం.. 101 సిక్సర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో వసీం తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఘనత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ ఈ ఏడాది టీ20ల్లో 80 సిక్సర్లు (35 మ్యాచ్‌ల్లో) బాదాడు. ఈ విభాగంలో ఆ తర్వాతి రెండు స్థానాలు కూడా రోహిత్ శర్మ పేరిటే ఉన్నాయి. 2019, 2018 క్యాలెండర్ ఇయర్స్‌లో హిట్‌మ్యాన్ వరుసగా 78, 74 సిక్సర్లు బాదాడు. ఈ విభాగంలో ఐదో స్థానంలో టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. స్కై 2022లో 74 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో వీరి తర్వాత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2012లో 26 మ్యాచ్‌ల్లో 59 సిక్సర్లు కొట్టాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో ముహమ్మద్ వసీం 32 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 53 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో యూఏఈ సంచలన విజయం సాధించింది. వసీంతో పాటు ఆర్యన్ లక్రా (63 నాటౌట్) కూడా అర్ధసెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఆఫ్ఘనిస్తాన్ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటై, 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముహమ్మద్ జవాదుల్లా (4/26), అలీ నసీర్ (4/24) ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ నబీ (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో యూఏఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 2న జరుగనుంది. -
న్యూజిలాండ్‌కు బిగ్‌షాకిచ్చిన పసికూన.. 7 వికెట్ల తేడాతో సంచలన విజయం
న్యూజిలాండ్‌కు పసికూన యూఏఈ బిగ్‌షాకిచ్చింది. దుబాయ్ వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై యూఏఈకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. అదే విధంగా దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో యూఏఈకు ఇదే మొదటి గెలుపు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో యూఏఈ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. యూఏఈ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 144 పరుగుల మాత్రమే చేయగల్గింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో చాప్మాన్(63) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. యూఏఈ బౌలర్లలో ఆయాన్ ఖాన్ మూడు వికెట్లతో చెలరేగగా.. జవదుల్లా రెండు, నసీర్, మహ్మద్ ఫరాజుద్దీన్ తలా వికెట్ సాధించారు. వసీం కెప్టెన్ ఇన్నింగ్స్.. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 15.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యూఏఈ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ వసీం(55) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఆసీఫ్ ఖాన్(48 నాటౌట్) పరుగులతో రాణించాడు. కివీస్ బౌలర్లలో సౌథీ, శాంట్నర్, జేమీసన్ తలా వికెట్ సాధించారు. ఇక సిరీస్ డిసైడర్ మూడో టీ20 దుబాయ్ వేదికగా ఆదివారం జరగనుంది. చదవండి: సిరీస్‌పై భారత్ కన్ను The moment UAE became the first associate team to beat New Zealand...!! A proud day for UAE cricket. pic.twitter.com/v6t6MvpXfc — Mufaddal Vohra (@mufaddal_vohra) August 19, 2023 -
మన హీరోల్ని ట్రీట్ చేసే విధానం ఇదేనా?
కరాచీ: ఇటీవల దుబాయ్‌లో జరిగిన బాక్సింగ్ బౌట్లో ఫిలీప్పిన్స్ బాక్సర్ కార్నడో తనోమోర్‌ను కేవలం 82 సెకండ్లలో నాకౌట్ చేసి దిగ్విజయంగా స్వదేశానికి వచ్చిన పాకిస్తాన్ ప్రొఫెషనల్ బాక్సర్ మహ్మద్ వసీంకు చేదు అనుభవమే ఎదురైంది. దేశం తరఫున విజయం సాధిస్తే అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా మహ్మద్ వసీంకు కనీస స్వాగత ఏర్పాట్లు చేయలేదు. దీన్ని ఘోర అవమానంగా భావించిన వసీం.. ‘తాను పాకిస్తాన్ టాలెంట్‌ను ప్రపంచ వేదికపై చాటడానికి మాత్రమే వెళతాను. ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతాల కోసం నేను ఫైట్ చేయడం లేదు. ప్రతీ క్యాంప్, ప్రతీ టూర్, ప్రతీ ట్రైయినింగ్ నాకు ముఖ్యమే. పాకిస్తాన్ బాక్సింగ్ టాలెంట్‌ను ప్రపంచం గుర్తించాలనే కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశాడు. దీనిపై పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ స్పందిస్తూ.. ఇదేనా తమ దేశ హీరోల్ని గౌరవించుకునే విధానం అంటూ ధ్వజమెత్తాడు. ‘నేను వసీంకు పాక్ తరఫున క్షమాపణలు చెబుతున్నా. దేశం తరఫున ఎవరైనా సత్తా చాటితే వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. మన హీరోల్ని ఎలా ట్రీట్ చేయాలో అనేది గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇవే నా క్షమాపణలు. నువ్వు తర్వాత బౌట్లో గెలిచినప్పడు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు నేను వచ్చి నిన్ను రిసీవ్ చేసుకుంటా. నీ విజయానికి ఇవే నా అభినందలు’ అని అక్రమ్ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ పది బౌట్లలో పాల్గొన్న వసీం.. ఒకదాంట్లో మాత్రమే పరాజయం చూసి తొమ్మిది బౌట్లలో గెలుపు అందుకున్నాడు. ఇందులో ఏడు నాకౌట్ విజయాలు ఉండటం విశేషం. -
'రెచ్చగొట్టి నా కూతుర్ని చంపించాడు'
లాహోర్: తమ కుమార్తె హత్యకు మతాధికారి ముఫ్తీ అబ్దుల్ ఖావి కారణమని పాకిస్థాన్ వివాదస్పద మోడల్ కందిల్ బలోచ్ తల్లి ఆరోపించారు. తన కొడుకు మొహ్మద్ వసీంను ఖావి రెచ్చగొట్టి తన కూతురిని చంపించాడని ఆమె పేర్కొంది. కందిల్ హత్య కేసులో ఖావి పేరును చేర్చినట్టు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఆమె ఈ ఆరోపణ చేశారు. జియో న్యూస్ తో ఆమె మాట్లాడుతూ... 'నా కూతురు హత్య కేసులో ముఫ్తీ అబ్దుల్ ఖావి, కందిల్ మాజీ భర్త ఆశిక్ హుస్సేన్, మరో వ్యక్తి షాహిద్ ప్రమేయముంది. ఖావి సలహా మేరకు కందిల్ ను వసీం చంపాడు. ఖావి రెచ్చగొట్టడం వల్లే ఇదంతా చేశాడు. కందిల్ మాజీ భర్త హుస్సేన్ తోనూ వసీం కాంటాక్ట్ లో ఉన్నాడ'ని చెప్పారు. ఈ కేసులో ఖావి పేరు కూడా చేర్చామని, ఫోరెన్సిక్ నివేదిక కోసం చూస్తున్నామని ముల్తాన్ పోలీస్ చీఫ్ అజహర్ ఇక్రమ్ తెలిపారు. కందిల్ తో సెల్ఫీ దిగడంతో ఖావి.. మతాధికారి పదవి కోల్పోయాడు. కాగా, తమ కుటుంబం పరువు మంటగలుపుతుందనే కందిల్ ను హత్య చేసినట్టు ఆమె సోదరుడు వసీం కోర్టు ముందు అంగీకరించాడు.