'రెచ్చగొట్టి నా కూతుర్ని చంపించాడు' | Cleric Mufti Abdul Qavi 'Provoked' Murder Of Qandeel Baloch: Mother | Sakshi
Sakshi News home page

'రెచ్చగొట్టి నా కూతుర్ని చంపించాడు'

Published Tue, Jul 19 2016 10:00 AM | Last Updated on Mon, Jul 30 2018 8:14 PM

ముఫ్తీ అబ్దుల్ ఖావితో కందిల్ సెల్ఫీ (ఫైల్) - Sakshi

ముఫ్తీ అబ్దుల్ ఖావితో కందిల్ సెల్ఫీ (ఫైల్)

లాహోర్: తమ కుమార్తె హత్యకు మతాధికారి ముఫ్తీ అబ్దుల్ ఖావి కారణమని పాకిస్థాన్ వివాదస్పద మోడల్ కందిల్‌ బలోచ్‌ తల్లి ఆరోపించారు. తన కొడుకు మొహ్మద్ వసీంను ఖావి రెచ్చగొట్టి  తన కూతురిని చంపించాడని ఆమె పేర్కొంది. కందిల్ హత్య కేసులో ఖావి పేరును చేర్చినట్టు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఆమె ఈ ఆరోపణ చేశారు.

జియో న్యూస్ తో ఆమె మాట్లాడుతూ... 'నా కూతురు హత్య కేసులో ముఫ్తీ అబ్దుల్ ఖావి, కందిల్ మాజీ భర్త ఆశిక్ హుస్సేన్, మరో వ్యక్తి షాహిద్ ప్రమేయముంది. ఖావి సలహా మేరకు కందిల్ ను వసీం చంపాడు. ఖావి రెచ్చగొట్టడం వల్లే ఇదంతా చేశాడు. కందిల్ మాజీ భర్త హుస్సేన్ తోనూ వసీం కాంటాక్ట్ లో ఉన్నాడ'ని చెప్పారు.

ఈ కేసులో ఖావి పేరు కూడా చేర్చామని, ఫోరెన్సిక్ నివేదిక కోసం చూస్తున్నామని ముల్తాన్ పోలీస్ చీఫ్ అజహర్ ఇక్రమ్ తెలిపారు. కందిల్ తో సెల్ఫీ దిగడంతో ఖావి.. మతాధికారి పదవి కోల్పోయాడు. కాగా, తమ కుటుంబం పరువు మంటగలుపుతుందనే కందిల్ ను హత్య చేసినట్టు ఆమె సోదరుడు వసీం కోర్టు ముందు అంగీకరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement