రోజు వ్యవధిలో సెంచరీలు కొట్టనున్న నలుగురు స్టార్‌ క్రికెటర్లు | 4 Cricketers Going To Play Their 100th Test Match This Week - Sakshi
Sakshi News home page

రోజు వ్యవధిలో సెంచరీలు కొట్టనున్న నలుగురు స్టార్‌ క్రికెటర్లు

Published Tue, Mar 5 2024 9:10 PM | Last Updated on Wed, Mar 6 2024 9:14 AM

Ashwin And Bairstow On 7th, Williamson And Southee On 8th Going To Play Their 100th Test - Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క రోజు వ్యవధిలో నలుగురు స్టార్‌ క్రికెటర్లు సెంచరీలు కొట్టబోతున్నారు. మార్చి 7, 8 తేదీల్లో టీమిండియాకు చెందిన రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇంగ్లండ్‌కు చెందిన జానీ బెయిర్‌స్టో, న్యూజిలాండ్‌కు చెందిన కేన్‌ విలియమ్సన్‌, టిమ్‌ సౌథీలు తమ కెరీర్‌లలో వందో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనున్నారు. రోజు వ్యవధిలో నలుగురు స్టార్‌ క్రికెటర్లు వందో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడటం క్రికెట్‌ చరిత్రలో బహుశా జరిగి ఉండకపోవచ్చు.

ఈ రికార్డుకు సంబంధించిన సరైన సమాచారం లేదు కానీ, ఇలాంటి సందర్భం రావడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మరో విశేషమేమిటంటే.. పై పేర్కొన్న తేదీల కంటే కొద్ది రోజుల ముందు (ఫిబ్రవరి 15న) ఇంగ్లండ్‌కే చెందిన మరో ఆటగాడు వంద టెస్ట్‌ సెంచరీల మార్కును తాకాడు. ఇంగ్లీష్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ భారత్‌తో జరిగిన మూడో టెస్ట్‌తో వంద సెంచరీల అరుదైన మైలురాయిని తాకాడు. 

ధర్మశాల వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య మార్చి 7న మొదలయ్యే ఐదో టెస్ట్‌ మ్యాచ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, జానీ బెయిర్‌స్టోలకు వందో టెస్ట్‌ మ్యాచ్‌ కానుండగా.. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న మొదలయ్యే రెండో టెస్ట్‌ మ్యాచ్‌ కివీస్‌ ఆటగాళ్లు కేన్‌ విలియమ్సన్‌, టిమ్‌ సౌథీలకు సెంచరీ మ్యాచ్‌ అవుతుంది.

  • జానీ బెయిర్‌స్టో- 99 టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 5974 పరుగులు
  • రవింద్రన్‌ అశ్విన్‌- 99 టెస్ట్‌ల్లో 5 సెంచరీలు, 3309 పరుగులు, 507 వికెట్లు
  • కేన్‌ విలియమ్సన్‌- 99 టెస్ట్‌ల్లో 32 సెంచరీలు, 8675 పరుగులు, 30 వికెట్లు
  • టిమ్‌ సౌథీ-99 టెస్ట్‌ల్లో 6 హాఫ్‌ సెంచరీలు, 2072 పరుగులు, 378 వికెట్లు

టెస్ట్‌ల్లో ఇప్పటివరకు 75 మంది 100 టెస్ట్‌ల మార్కును తాకారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ తరఫున 15 మంది, భారత్‌ తరఫున 13, వెస్టిండీస్‌ నుంచి 9, సౌతాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్తాన్‌ 5, న్యూజిలాండ్‌ తరఫున నలుగురు 100 టెస్ట్‌ల మార్కును తాకారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం​ చేసుకుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement