లంకతో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన(PC: Blackcaps)
Sri Lanka Tour New Zealand, 2023: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. స్వదేశంలో లంకతో తలపడనున్న జట్టులో 13 మంది సభ్యులకు చోటిచ్చింది. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడిన జట్టునే కొనసాగించింది. కాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఘోర పరాభవం పాలైన కివీస్.. రెండో మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే.
లంకకు ఆ అవకాశం
ఈ క్రమంలో మార్చి 9 నుంచి లంకతో పోరుకు సిద్ధమవుతోంది టిమ్ సౌథీ బృందం. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో భాగంగా కివీస్- లంక మధ్య రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. క్రైస్ట్‌చర్చ్, వెల్లింగ్‌టన్‌లలో జరుగనున్న ఈ సిరీస్ శ్రీలంకకు కీలకంగా మారింది.
ఒకవేళ న్యూజిలాండ్‌ను గనుక లంక వైట్‌వాష్ చేయడం సహా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియా- ఆస్ట్రేలియాను క్లీన్‌స్వీప్ చేస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు కరుణరత్నె బృందానికి అవకాశాలు ఉంటాయి. అయితే, సొంతగడ్డపై కివీస్‌ను ఓడించడం లంకకు తేలికేం కాదు. ఇక ఈ సిరీస్‌కు ఇప్పటికే లంక జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.
న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక టెస్టు సిరీస్-2023
మార్చి 9- మార్చి 21 వరకురెండు టెస్టులు
వేదికలు: క్రైస్ట్‌చర్చ్, వెల్లింగ్‌టన్
లంకతో సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు ఇదే
టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్), మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగ్నర్, స్కాట్ కుగ్గెలీజన్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.
చదవండి: WTC NZ Vs SL: కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో!
BGT 2023: పుజారా భయపడుతున్నాడు.. అయ్యర్ పిరికిపందలా ఉన్నాడు! ముందుందిలే..
Comments
Please login to add a commentAdd a comment