Kane Williamson Surprises His Ardent Fan With Gift Ahead 99th Birthday Viral - Sakshi
Sakshi News home page

Kane Williamson: 99వ పుట్టినరోజుకు ముందు.. వీరాభిమానికి కేన్‌మామ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌! ఫొటో వైరల్‌

Published Fri, Mar 24 2023 3:28 PM | Last Updated on Fri, Mar 24 2023 4:34 PM

Kane Williamson Surprises His Ardent Fan By Gift Ahead 99th Birthday Viral - Sakshi

వీరాభిమానితో కేన్‌ విలియమ్సన్‌ (PC: Twitter)

Kane Williamson- IPL 2023: న్యూజిలాండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తన వీరాభిమానికి అదిరిపోయే బహుమతి అందించాడు. 99వ పుట్టినరోజు వేడుకకు సిద్ధమవుతున్న ‘తాతయ్య’కు తన సంతకంతో కూడిన బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అంతేగాక ఆయనతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చి పెద్దాయనను ఖుషీ చేశాడు.

ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘సూపర్‌ కేన్‌ మామ.. ఆయన ముఖం సంతోషంతో నిండిపోయేలా చేశావు. త్వరలోనే మళ్లీ నీ బ్యాటింగ్‌ను చూడబోతున్నాం. ఆల్‌ ది బెస్ట్‌’’ అని విష్‌ చేస్తున్నారు.

లంకతో సిరీస్‌లో సూపర్‌హిట్‌
కాగా ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్‌లో కేన్‌ విలియమ్సన్‌ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. మొత్తంగా 337 పరుగులు సాధించిన ఈ స్టార్‌ బ్యాటర్‌.. లంకను కివీస్‌ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు. ఇక ఐపీఎల్‌-2023లో కేన్‌ విలియమ్సన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో సుదీర్ఘ అనుబంధం కలిగిన కేన్‌ మామను వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

గుజరాత్‌ తరఫున
ఈ క్రమంలో మినీ వేలంలో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌ 2 కోట్ల రూపాయల కనీస ధరకు విలియమ్సన్‌ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో కేన్‌ ఆడునున్నాడు. ఇక చెన్నై సూపర్‌కింగ్స్‌తో అహ్మదాబాద్‌ వేదికగా మార్చి 31న గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌తో క్యాష్‌రిచ్‌ లీగ్‌ పదహారవ సీజన్‌కు తెరలేవనుంది. 

చదవండి: Ben Stokes: 'నేను వచ్చేశా'.. సీఎస్‌కే ఫ్యాన్స్‌లో జోష్‌
Asia Cup 2023: ఓటమి భయం.. అందుకే రానంటున్నారు! అంత సీన్‌ లేదులే గానీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement