డెబ్యూ మ్యాచ్‌లోనే గొడవ.. మోర్గాన్‌ మద్దతు | Heat Conversation Ravichandran Ashwin And Tim Southee Ian Morgan Support | Sakshi
Sakshi News home page

IPL 2021: డెబ్యూ మ్యాచ్‌లోనే గొడవ.. మోర్గాన్‌ మద్దతు

Published Tue, Sep 28 2021 5:36 PM | Last Updated on Tue, Sep 28 2021 9:53 PM

Heat Conversation Ravichandran Ashwin And Tim Southee Ian Morgan Support - Sakshi

Courtesy: IPL Twitter

Ravichandran Ashwin Vs Tim Southee..  ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ తరపున కివీస్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ  డెబ్యూ మ్యాచ్‌ ఆడాడు. అయితే ఆడిన తొలి మ్యాచ్‌లోనే సౌథీ గొడవ పడడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ బ్యాటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో మాటల యుద్దానికి దిగాడు. ఇంతలో మోర్గాన్‌ కలగజేసుకోగా.. వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ వచ్చి అశ్విన్‌ను దూరంగా తీసుకెళ్లాడు. అయితే వెళ్తూ వెళ్తూ అశ్విన్‌ సౌథీకి బ్యాట్‌ చూపిస్తూ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. ఇక సౌథీ వేసిన స్లోబాల్‌ను అశ్విన్‌ ఫ్లిక్‌ చేయగా.. గాల్లోకి లేవడంతో డీప్‌ స్వేర్‌లెగ్‌లో ఉన్న నితీష్‌ రాణా పరిగెత్తుకు వచ్చి క్యాచ్‌ అందుకున్నాడు. 

చదవండి: నరైన్‌ సూపర్‌ బౌలింగ్‌.. అయ్యర్‌కు బొమ్మ కనపడింది


Courtesy: IPL Twitter

కాగా ఇద్దరి మధ్య గొడవకు కారణం అంతకముందు ఓవర్‌ అట.. వెంకటేశ్‌ అయ్యర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ ఐదో బంతికి పంత్‌ రెండు పరుగులు తీశాడు. అయితే అశ్విన్‌ రెండో పరుగు కోసం వెళ్లగా.. అయ్యర్‌ బంతి అందుకోవడంలో విఫలమయ్యాడు. అయ్యర్‌కు అశ్విన్‌ అడ్డురావడంతో రనౌట్‌ మిస్‌ అయింది. అయితే ఇందులో అశ్విన్‌ తప్పు ఏం లేదు. ఇది మనసులో పెట్టుకొని సౌథీ అలా చేసి ఉంటాడని.. అందుకు మోర్గాన్‌ మద్దతు పలికాడంటూ అభిమానులు కామెంట్స్‌ చేశారు. 

చదవండి: T20 World Cup 2021: భువీ స్థానంలో అతనికి అవకాశం ఇస్తే మంచిదేమో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement