పాకిస్తాన్ 76/5 | New Zealand first innings 271 | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ 76/5

Published Sat, Nov 26 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

పాకిస్తాన్ 76/5

పాకిస్తాన్ 76/5

తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 271 

హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ పాకిస్తాన్ తడబడుతోంది. పేసర్ టిమ్ సౌతీ (3/26) విజృంభించడంతో శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్‌‌సలో పాకిస్తాన్ 29 ఓవర్లలో ఐదు వికెట్లకు 76 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (80 బంతుల్లో 34 బ్యాటింగ్; 5 ఫోర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.

క్రీజులో తనతో పాటుగా సర్ఫరాజ్ అహ్మద్ (9 బ్యాటింగ్) ఉన్నాడు. సౌతీ, వాగ్నర్ (2/15) ధాటికి ఓ దశలో పాక్ 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోరుుంది. ప్రస్తుతం కివీస్‌కన్నా పాక్ 195 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్‌‌సలో 83.4 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌట్ అరుు్యంది. రావెల్ (55), వాట్లింగ్ (49 నాటౌట్) రాణించారు. సోహైల్‌కు నాలుగు,వికెట్లు దక్కారుు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement