న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్, స్టార్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సౌథీ రికార్డులకెక్కాడు. చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో జానీ బెయిర్‌స్టోను ఔట్ చేసిన సౌథీ.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఇప్పటివరకు 111 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ కివీస్ వెటరన్ 8.13 ఏకనామీతో 141 వికెట్లు పడగొట్టాడు. కాగా అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్(140) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో షకీబ్ రికార్డును సౌథీ బ్రేక్ చేశాడు.
కాగా రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా దూరం కావడంతో ఇంగ్లండ్ పర్యటనలో కివీస్ జట్టును సౌథీ నడిపిస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో కివీస్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 139 పరుగులు మాత్రమే చేసింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో లూక్ వుడ్, కార్స్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. రషీద్,మోయిన్ అలీ, లివింగ్ స్టోన్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 140 లక్ష్యాన్ని కేవలం 14 ఓవర్లలోనే ఇంగ్లండ్ ఊదిపడేసింది. గ్లండ్ బ్యాటర్లలో డేవిడ్ మలాన్(54), హ్యారీ బ్రూక్(43 నాటౌట్) పరుగులతో మ్యాచ్‌ను మగించారు.
చదవండి: Asia Cup 2023 Ind Vs Pak Clash: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కష్టమే!
Comments
Please login to add a commentAdd a comment