సౌతాఫ్రికా స్వదేశంలో జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 26) ప్రకటించారు. ఈ సిరీస్‌లో టిమ్ సౌథీ న్యూజిలాండ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ విల్ ఓ రూర్కీకు తొలి సారి టెస్ట్ జట్టులో అవకాశం లభించింది. వరల్డ్‌కప్ హీరో రచిన్ రవీంద్ర ఈ సిరీస్‌తో టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే రచిన్ వన్డేల్లోలా ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో సీనియర్ ప్లేయర్ హెన్రీ నికోల్స్‌కు అవకాశం లభించలేదు కాదు కాబట్టి రచిన్‌కు దాదాపు లైన్ క్లియర్ అయినట్లే.
2021 భారత పర్యటనలో టెస్ట్ అరంగేట్రం చేసిన రచిన్.. ఆ పర్యటనలో రెండు టెస్ట్‌లు, ఆతర్వాత 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌లో మాత్రమే ఆడాడు. ఆతర్వాత రచిన్‌కు టెస్ట్ జట్టులో అవకాశం దొరకలేదు. తిరిగి ఇన్నాళ్లకు రచిన్‌కు టెస్ట్ జట్టులో ఆడే అవకాశం వచ్చింది. వన్డే వరల్డ్‌కప్ 2023 అద్భుత ప్రదర్శనకు గానూ రచిన్ గతేడాది ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ మౌంట్ మాంగనూయ్ వేదికగా ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు.. రెండో మ్యాచ్ హ్యామిల్టన్ వేదికగా ఫిబ్రవరి 13 నుంచి 17 తేదీల మధ్యలో జరుగుతుంది.
సౌతాఫ్రికాతో సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్), టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కీ (రెండో టెస్టుకు మాత్రమే), గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్ , విల్ యంగ్
Comments
Please login to add a commentAdd a comment