న్యూఢిల్లీ: సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఐపీఎల్ పార్ట్-2 నుంచి పలువురు ఆటగాళ్లు వివిధ కారణాలు చేత తప్పుకోవడంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు ఆయా ఫ్రాంచైజీలు నానా తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఇదివరకే చాలా జట్లు రిప్లేస్‌మెంట్ ఆటగాళ్లును ఎంపిక చేసుకుంది. తాజాగా, కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) జట్టు న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీని జట్టులోకి తీసుకోగా, పంజాబ్ కింగ్స్ జట్టు ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను జట్టులోకి చేర్చుకున్నాయి.
సౌథీ.. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్‌ను రీప్లేస్ చేయనుండగా, రషీద్ ఆసీస్ పేసర్ జై రిచర్డ్‌సన్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఆదిల్ రషీద్ ఐపీఎల్‌లో తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, సౌథీ గతంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో వరుసగా ఆరు సీజన్లు ఆడిన సౌథీ గతేడాది వేలంలో అమ్ముడుపోలేదు. చివరిసారి అతను 2019 ఐపీఎల్‌లో కోహ్లి సారథ్యంలో ఆర్సీబీకి ఆడాడు.
చదవండి: పీసీబీ అధ్యక్షుడిగా పాక్ ప్రధాని సన్నిహితుడు..
Comments
Please login to add a commentAdd a comment