Ind Vs Nz 2021 Test Series Kanpur 1st Test Day 4 Highlights Updates Telugu
Sakshi News home page

Ind Vs Nz 1st Test Day 4: నాలుగోరోజు ముగిసిన ఆట.. విజయానికి 9 వికెట్ల దూరంలో టీమిండియా

Published Sun, Nov 28 2021 9:34 AM | Last Updated on Sun, Nov 28 2021 4:58 PM

Ind Vs Nz 2021 Test Series Kanpur 1st Test Day 4 Highlights Updates Telugu - Sakshi

Ind Vs Nz 2021 Test Series Kanpur 1st Test Day 4 Highlights Updates Telugu: 4:40PM: న్యూజిలాండ్‌, టీమిండియా మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 4 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో టామ్‌ లాథమ్‌(2),సోమర్‌విల్లే(0) పరుగులతో ఉన్నారు. అంతకుముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 234/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగులు కలుపుకుని న్యూజిలాండ్ ముందు 283 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఉంచింది. 

283 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ అదిలోనే ఓపెనర్‌ విల్‌యంగ్‌ వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చేసిన యంగ్‌.. ఆశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్బీ రూపంలో పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం క్రీజులో టామ్‌ లాథమ్‌, విలియం సోమర్‌విల్లే ఉన్నారు.

4:24 PM: కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో 234/7  పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను టీమిండియా డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకుని న్యూజిలాండ్ ముందు 283 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఉంచింది. భారత బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్‌ 65, వృద్ధిమాన్‌ సాహా(62) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ,జెమీషన్‌ చెరో మూడు వికెట్లు సాధించారు.

3:24 PM: టీమిండియా ప్రస్తుత స్కోరు- 202/7. భారత్‌ ప్రస్తుతం 252 పరుగుల ఆధిక్యంలో ఉంది. అక్షర్‌ పటేల్‌(14), వృద్ధిమాన్‌ సాహా(44) క్రీజులో ఉన్నారు. 

2:48 PM: టీమిండియా ప్రస్తుతం 227 పరుగుల ఆధిక్యంలో ఉంది. అక్షర్‌ పటేల్‌(4), వృద్ధిమాన్‌ సాహా(29) క్రీజులో ఉన్నారు. 

02:25:
అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్‌ అయ్యర్‌(65) అవుట్‌ అయ్యాడు. సౌథీ బౌలింగ్‌లో బ్లెండెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.
భారత్‌ 216 పరుగుల ఆధిక్యంలో ఉంది.
02: 10 PM:
శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 124 బంతులు ఎదుర్కొన్న అయ్యర్‌ 65 పరుగులతో క్రీజులో ఉన్నాడు. వృద్ధిమాన్‌ సాహా (22 పరుగులు)అతడికి సహకారం అందిస్తున్నాడు. రహానే సేన ప్రస్తుతం62 216 పరుగుల ఆధిక్యంలో ఉంది.

01:47 PM:
అరంగేట్ర టెస్టు తొలి ఇ‍న్నింగ్స్‌లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న శ్రేయస్‌ అయ్యర్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీతో మెరిశాడు. వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టు పాలిట ఆశాకిరణంలా మారి 109 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

01: 40 PM:
►టీమిండియా బ్యాటర్లు శ్రేయస్‌ అయ్యర్‌, వృద్ధిమాన్‌ సాహా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 

01:16 PM:
►169 పరుగుల ఆధిక్యంలో భారత్‌
►వృద్ధిమాన్‌ సాహా 7 పరుగులు, శ్రేయస్‌ అయ్యర్‌ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు.

12:40 PM: రవిచంద్రన్‌ అశ్విన్‌ను దురదృష్టం వెంటాడింది. జెమీషన్‌ బౌలింగ్‌లో అశ్విన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు. దీంతో టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది.
టీమిండియా 156 పరుగుల ఆధిక్యంలో ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌, వృద్ధిమాన్‌ సాహా క్రీజులో ఉన్నారు.

12:28PM: టీమిండియా ప్రస్తుత స్కోరు- 100/5. భారత్‌ 149 పరుగుల ఆధిక్యంలో ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌ 24, అశ్విన్‌ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కివీస్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ టీమిండియాను దెబ్బకొడుతున్నాడు. కివీస్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ టీమిండియాను దెబ్బకొడుతున్నాడు. వరుసగా రెండు వికెట్లు తీసి.. రహానే సేనను కష్టాల్లోకి నెట్టేశాడు. మయాంక్‌ను అవుట్‌ చేసిన సౌథీ.. జడేజా క్రీజులోకి రాగా అద్భుత బంతిని సంధించాడు. దీంతో జడ్డూ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

11:30 AM:
లంచ్‌ బ్రేక్‌ సమయానికి టీమిండియా 133 పరుగుల ఆధిక్యంలో ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌ 18, అశ్విన్‌ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.

11:08 AM: టీమిండియా ప్రస్తుత స్కోరు- 73/5.

10:45 AM: జడ్డూ భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తద్వారా భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ 108 పరుగుల ఆధిక్యంలో ఉంది.

10:40 AM: టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. టిమ్‌ సౌథీ బౌలింగ్‌లో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ టామ్‌ లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

10:30 AM: నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది.  పుజారాను జామీసన్ పెవిలియన్‌కు పంపగా, కెప్టెన్‌ రహానే కేవలం నాలుగు పరుగులు చేసి ఆజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మయాంక్‌ అగర్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు.

32 పరుగుల వద్ద  టీమిండియా పుజారా రూపంలో రెండో వికెట్‌ కోల్పోయింది. 22 పరుగులు చేసిన పుజారా,  కైల్ జామీసన్ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 

కాన్పూర్‌ వేదికగా టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. కివీస్‌ బౌలర్‌ కైలీ జెమీషన్‌ బౌలింగ్‌ అటాక్‌ను ప్రారంభించాడు. మయాంక్‌ అగర్వాల్‌, ఛతేశ్వర్‌ పుజారా క్రీజులో ఉన్నారు. కాగా మూడో రోజు ఆటలో భాగంగా అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ అద్భుత ప్రదర్శనతో విలియమ్సన్‌ బృందాన్ని 296 పరుగులకే ఆలౌట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రహానే సేన రెండో ఓవర్‌ తొలి బంతికే శుభ్‌మన్‌ గిల్‌ (1) వికెట్‌ కోల్పోయింది. 

Updates:
09: 45 AM: 
► 78 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

09: 35 AM: 
►మయాంక్‌ అగర్వాల్‌(8), ఛతేశ్వర్‌ పుజారా(14) పరుగులతో క్రీజులో ఉన్నారు.
►72 పరుగుల ఆధిక్యంలో భారత్‌

భారత జట్టు: శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(కెప్టెన్‌) శ్రేయస్ అయ్యర్, శ్రీకర్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌- వృద్ధిమాన్ సాహా స్థానంలో సబ్‌స్టిట్యూట్‌‌), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్.

న్యూజిలాండ్‌ జట్టు:  టామ్‌ లాథమ్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్(కెప్టెన్‌), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(వికెట్‌ కీపర్‌), రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, కైల్ జామీసన్, విలియం సోమర్‌విల్లే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement