
హండ్రెడ్ లీగ్ 2024 పురుషుల ఎడిషన్ చివరి అంకానికి చేరింది. ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగు జట్లపై క్లారిటీ రానప్పటికీ.. టోర్నీ నుంచి నిష్క్రమించే జట్లేవో తేలిపోయాయి. నిన్న బర్మింగ్హమ్ ఫీనిక్స్ చేతిలో ఓటమితో ట్రెంట్ రాకెట్స్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. రాకెట్స్‌తో పాటు వెల్ష్ ఫైర్, మాంచెస్టర్ ఒరిజినల్స్, లండన్ స్పిరిట్ ఈ ఎడిషన్ నుంచి నిష్క్రమించాయి. ఓవల్ ఇన్విన్సిబుల్స్ మాత్రం అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. సథరన్ బ్రేవ్, బర్మింగ్హమ్ ఫీనిక్స్, నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ రేసులో ఉన్నాయి.
బర్మింగ్హమ్ ఫీనిక్స్, ట్రెంట్ రాకెట్స్ మధ్య నిన్న (ఆగస్ట్ 12) జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్ టిమ్ సౌథీ (20-13-12-5) ఐదు వికెట్ల ఘనతతో చెలరేగడంతో నిర్ణీత 100 బంతుల్లో 118 పరుగులకు ఆలౌటైంది. రాకెట్స్ ఇన్నింగ్స్‌లో అల్సోప్ (51), ఇమాద్ వసీం (29) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌథీతో పాటు క్రిస్ వుడ్ (20-7-30-2), ఆడమ్ మిల్నే (20-14-17-1) వికెట్లు తీశారు.
అనంతరం 119 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫీనిక్స్.. లివింగ్‌స్టోన్ (30 నాటౌట్), జేకబ్ బేతెల్ (38 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌లతో రాణించడంతో 93 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫీనిక్స్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ 30, మొయిన్ అలీ 13 పరుగులు చేయగా.. జేమీ స్మిత్, డాన్ మౌస్లీ గోల్డెన్ డకౌట్లయ్యారు. రాకెట్స్ బౌలర్లలో లూక్ వుడ్, జాన్ టర్నర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment