టెస్ట్‌ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్ల రికార్డు సాధించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం ఏడు సిక్సర్లు దూరంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ త్వరలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే సిరీస్‌లో మరో ఏడు సిక్సర్లు బాదితే టీమిండియా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వీరేందర్ సెహ్వాగ్ రికార్డును అధిగమిస్తాడు.
వీరూ 103 టెస్ట్‌ల్లో 90 సిక్సర్లు బాదగా.. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 84 సిక్సర్లు (59 టెస్ట్‌ల్లో) ఉన్నాయి. టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వీరూ, రోహిత్ తర్వాత ధోని (78), సచిన్ (69), రవీంద్ర జడేజా (64) టాప్-5లో ఉన్నారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కేవలం 26 సిక్సర్లు మాత్రమే కొట్టాడు.
మూడు ఫార్మాట్ల విషయానికొస్తే.. రోహిత్ ప్రపంచంలోనే అందరి కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఉన్నాడు. హిట్‌మ్యాన్ తన కెరీర్‌లో 483 మ్యాచ్‌లు ఆడి 620 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో రోహిత్ తర్వాతి స్థానాల్లో క్రిస్ గేల్ (553), షాహిద్ అఫ్రిది (476) టాప్-3లో ఉన్నారు.
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ విషయానికొస్తే.. రెండు టెస్ట్‌లు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు ఈ నెల 19 నుంచి భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగనుంది. తొలి టెస్ట్ సెప్టెంబర్ 19, రెండో టెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతాయి. టీ20 సిరీస్ అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment