US Batsman Jaskaran Malhotra Joins Elite Group With Six Sixes Over ODI - Sakshi
Sakshi News home page

Six Balls Six Sixes: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. వీడియో వైరల్‌

Published Fri, Sep 10 2021 7:07 AM | Last Updated on Fri, Sep 10 2021 12:44 PM

US Batsman Jaskaran Malhotra Joins Elite Group With Six Sixes Over ODI - Sakshi

అల్‌ అమీరట్‌ (మస్కట్‌): అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన ఘనత నమోదైంది. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా జస్కరన్‌ మల్హోత్రా (అమెరికా) నిలిచాడు. పపువా న్యూ గినియాతో జరిగిన రెండో వన్డేలో మీడియం పేసర్‌ గాడీ టోకా వేసిన 50వ ఓవర్లో జస్కరన్‌ వరుసగా 6, 6, 6, 6, 6, 6 పరుగులు బాదాడు. చండీగఢ్‌లో పుట్టి వలస వెళ్లిన జస్కరన్‌ అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

చదవండి: T20 World Cup 2021: స్టార్‌ ఓపెనర్‌కు మొండిచేయి.. బంగ్లా జట్టు ఇదే

ఈ ఇన్నింగ్స్‌లో 124 బంతుల్లో 4 ఫోర్లు, 16 సిక్సర్లతో 173 పరుగులతో అజేయంగా నిలిచిన అతను వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మోర్గాన్‌ (17) తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అమెరికా 134 పరుగుల తేడాతో గెలిచింది. 2007 వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో డాన్‌ వాన్‌ బంగ్‌ ఓవర్లో హెర్షల్‌ గిబ్స్‌ 6 సిక్సర్లు కొట్టగా... అంతర్జాతీయ టి20ల్లో యువరాజ్‌ సింగ్, కీరన్‌ పొలార్డ్‌ ఈ అరుదైన ఫీట్‌ను ప్రదర్శించారు.   

చదవండి: శిఖర్‌ ధావన్‌ను అందుకే ఎంపిక చేయలేదా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement