117 Runs With 13 Sixes And 4 Wickets, 18-Year-Old Arshin Kulkarni Takes MPL 2023 By Storm - Sakshi
Sakshi News home page

MPL 2023: 13 సిక్సర్లతో ఊచకోత.. బౌలింగ్‌లో ఆఖరి బంతికి గెలిపించిన చిచ్చరపిడుగు

Published Wed, Jun 21 2023 11:48 AM | Last Updated on Wed, Jun 21 2023 12:40 PM

13 Sixes-117 Runs-4 Wickets-18-Year-Old Arshin Kulkarni Strom-MPL 2023 - Sakshi

మహారాష్ట్ర ప్రీమియర్‌ లీగ్‌లో(MPL 2023) మరో సంచలన ఇన్నింగ్స్‌ నమోదైంది. దేశవాలీ క్రికెటర్‌ అర్షిన్‌ కులకర్ణి 46 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ అందుకొని లీగ్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. ఈగల్‌ నాసిక్‌ టైటాన్స్‌, పుణేరి బప్పా మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. 

మొదట బ్యాటింగ్ చేసిన ఈగల్ నాసిక్ టైటాన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అర్షన్‌ కులకర్ణి 54 బంతుల్లో 3 ఫోర్లు, 13 సిక్స్ లతో 216.67 స్ట్రైక్ రేట్ తో 117 పరుగులు చేశాడు.అయితే ఇందులో ఫోర్లు, సిక్సర్ల ద్వారానే 90 పరుగులు చేయడం గమనార్హం. అతనికి తోడుగా రాహుల్‌ త్రిపాఠి 28 బంతుల్లో 41 పరుగులు చేశాడు. 

అనంతరం 203 పరుగుల లక్ష్య చేదనకు దిగిన పుణేరి బప్పా గెలుపు కోసం దీటుగానే అద్భుత ఆటను ప్రదర్శించింది.చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో కేవలం ఒక్క పరుగు తేడాతో పుణేరి బప్పా ఓటమి పాలైంది. చివరి ఓవర్ లో ఆరు బంతులకు ఆరు పరుగులు చేయాల్సి ఉండగా ఐదు పరుగులు మాత్రమే చేసి ఓటమిని చవిచూసింది.ఇక పుణేరి బప్పా టీం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 23 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసిన అర్షన్‌ కులకర్ణి ఐదు పరుగులే ఇవ్వడంతో.. ఒక్క పరుగు తేడాతో ఈగల్ నాసిక్ టైటాన్స్ విజయం సాధించింది.

చదవండి: #Ashes2023: ఇంతకు మించి ఏమి కావాలి.. చాలా సంతోషంగా ఉంది: కమ్మిన్స్‌

'మ్యాచ్‌ పోతే పోయింది.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement