టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. టీ20 వరల్డ్‌కప్ 2024 హిట్‌మ్యాన్ మరో మూడు సిక్సర్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో) 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు.
2007 నుంచి ఇప్పటివరకు 472 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 498 ఇన్నింగ్స్‌ల్లో 597 సిక్సర్లు బాదాడు. అన్ని సవ్యంగా సాగితే టీ20 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లోనే హిట్‌మ్యాన్ 600 సిక్సర్ల మార్కును తాకుతాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్‌కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ 330 సిక్సర్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఆతర్వాత వార్నర్ 312 సిక్సర్లతో 11వ స్థానంలో.. 294 సిక్సర్లతో విరాట్ కోహ్లి 12వ స్థానంలో నిలిచారు.
ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌లో భారత ప్రస్తానం జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. దీనికి ముందు భారత్ ఇవాళ (జూన్ 1) బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. మెగా టోర్నీలో భారత్ రెండో మ్యాచ్ జూన్ 9న ఆడుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్‌లో రోహిత్ సేన చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌తో తలపడనుంది.
మరో రికార్డుపై కూడా కన్నేసిన రోహిత్
జూన్ 5న ఐర్లాండ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో రికార్డుపై కూడా కన్నేశాడు. ఆ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో 26 పరుగులు చేస్తే.. విరాట్, బాబర్ తర్వాత 4000 టీ20 పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రోహిత్ 151 టీ20 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 3974 పరుగులు చేశాడు. విరాట్ 117 మ్యాచ్‌ల్లో 4037 పరుగులు.. బాబర్ 119 మ్యాచ్‌ల్లో 4023 పరుగులు చేసి రోహిత్ కంటే ముందున్నారు.
Comments
Please login to add a commentAdd a comment