
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో(ఐపీఎల్) విండీస్ విధ్వంసకర యోధుడు, పంజాబ్ కింగ్స్ కీలక సభ్యుడు క్రిస్ గేల్ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. లీగ్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో యూనివర్సల్ బాస్ ఎవరికీ అందనంత ఎత్తుకి వెళ్లిపోయాడు. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అదిరిపోయే సిక్సర్ బాదిన గేల్.. ఐపీఎల్ చరిత్రలో 350 సిక్సర్లు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను తెవాతియా బౌలింగ్‌లో సైతం మరో సిక్సర్ బాది ఆ సంఖ్యను 351కి పెంచుకున్నాడు.
Milestone 🚨 - 3⃣5⃣0⃣ Maximums in the IPL for the Universe Boss 💥💥#VIVOIPL | #RRvPBKS | @henrygayle pic.twitter.com/bhIxAAmq2J
— IndianPremierLeague (@IPL) April 12, 2021
ఇదిలా ఉంటే, లీగ్ చరిత్రలో మరే ఇతర బ్యాట్స్‌మన్ కనీసం 250 సిక్సర్ల మార్క్ కూడా చేరుకోలేకపోవడం విశేషం. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు, ఆర్‌సీబీ కీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ 237 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా, టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారధి ధోని 216 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 214, బెంగళూరు కెప్టెన్ కోహ్లి 201 సిక్సర్లతో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 133 మ్యాచ్‌లు ఆడిన గేల్ 351 సిక్సర్లు బాదాడు. కాగా, రాజస్థాన్ రాయల్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పంజాబ్ కింగ్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. పంజాబ్ భారీ స్కోర్ నమోదు చేయడంలో గేల్(28 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తన వంతు పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment