Courtesy: BCCI/ IPL Twitter
సీఎస్‌కే ఆటగాడు ఎంఎస్ ధోని ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో ధోని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రిషి ధవన్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతిని ధోని డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్‌లెగ్ దిశగా భారీ సిక్స్ బాదాడు. కాగా ఈ సిక్సర్ సీఎస్‌కే తరపున ధోనికి 220వది కాగా ఓవరాల్‌గా 224వది. ఇక సీఎస్‌కే తరపున ఇప్పటివరకు సురేశ్ రైనా పేరిట ఉన్న అత్యధిక సిక్సర్లు(219) రికార్డును ధోని అధిగమించాడు.
ధోని, రైనాల తర్వాత ఫాఫ్ డుప్లెసిస్(93) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా సిక్సర్ల విషయంలో ధోని(224) నాలుగో స్థానంలో ఉండగా.. క్రిస్ గేల్ 357 సిక్సర్లతో తొలి స్థానంలో, ఏబీ డివిలియర్స్ 239 సిక్సర్లతో రెండో స్థానంలో, రోహిత్ శర్మ 234 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక అంతర్జాతీయ, అన్ని టి20 లీగ్‌లు కలిపి చూసుకుంటే అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో గేల్( 461 మ్యాచ్‌ల్లో 1056 సిక్సర్లు), కీరన్ పొలార్డ్(579 మ్యాచ్‌ల్లో 764 సిక్సర్లు) , ఆండ్రీ రసెల్(393 మ్యాచ్‌ల్లో 517 సిక్సర్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
చదవండి: Sakshi Dhoni: జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ధోని భార్య
Comments
Please login to add a commentAdd a comment