అఫ్గానిస్తాన్ బ్యాటర్ నజీబుల్లా జర్దన్.. మంగళవారం ఆసియాకప్‌లో భాగంగా గ్రూఫ్-బిలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతుల్లోనే 6 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 43 పరుగులు సాధించిన నజీబుల్లా ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో అఫ్గనిస్తాన్ గ్రూఫ్-బి టాపర్‌గా సూపర్-4 చేరింది. కాగా సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసిన నజీబుల్లా జర్దన్ తాను కొట్టిన ఆరు సిక్సర్లతో ఏకంగా ప్రపంచ రికార్డు సాధించాడు.
టి20 క్రికెట్‌లో చేజింగ్‌లో డెత్ ఓవర్స్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నజీబుల్లా జర్దన్ అగ్రస్థానంలో ఉన్నాడు. చేజింగ్ సమయంలో నజీబుల్లా ఇప్పటివరకు 18 సిక్సర్లు(తాజా మ్యాచ్‌తో కలిపి) బాదాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్(17 సిక్సర్లు), శ్రీలంక ఆల్‌రౌండర్ తిసార పెరీరా(17 సిక్సర్లు)లను నజీబుల్లా అధిగమించడం విశేషం. దీంతో పాటు మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
అదేంటంటే.. టి20 క్రికెట్‌లో తొలి, రెండో ఇన్నింగ్స్ అని కాకుండా డెత్ ఓవర్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగాను నిలిచాడు. నజీబుల్లా ఇప్పటివరకు డెత్ ఓవర్లలో 53 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో ప్రొటిస్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ 47 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.'' వికెట్ చాలా లోగా ఉంది అందుకే నేరుగా ఆడేందుకు ప్రయత్నించాను. ఆరంభంలో కుదురుకునేందుకు కొన్ని బంతులు తీసుకున్నప్పటికి ఆ తర్వాత నా శైలిలో ఆడాను. నేను సరిహద్దులు చూడను.. కేవలం బౌలర్‌ను మాత్రమే గమనిస్తాను.. విజయంతో సూపర్-4కు చేరుకున్నాం అంటూ నజీబుల్లా మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంటూ పేర్కొన్నాడు.
ఇక మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. రెండు విజయాలతో అఫ్గానిస్తాన్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. మొదట బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 127 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముజీబ్ వుర్ రహ్మాన్ (3/16), రషీద్ ఖాన్ (3/22) తిప్పేశారు. ముసాదిక్ (31 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం అఫ్గానిస్తాన్ 13 ఓవర్లలో 3 వికెట్లకు 62 పరుగులే చేసింది. లక్ష్యంలో సగం స్కోరైనా చేయలేదు. ఈ దశలో నజీబుల్లా (17 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇబ్రహీమ్ (41 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 69 పరుగులు చేసి గెలిపించాడు.
చదవండి: Rashid Khan Asia Cup 2022: బంగ్లాపై విజయం.. రషీద్ ఖాన్ ఖాతాలో కొత్త రికార్డు
Colin De Grandhome: అంతర్జాతీయ క్రికెట్‌కు కివీస్ ఆల్‌రౌండర్ గుడ్‌బై
Comments
Please login to add a commentAdd a comment